అస్సాం ఎన్నికలు, జైల్లో ఉన్నా పోటీ చేసి బీజేపీ అభ్యర్థిపై గెలిచాడు, ప్రచారం చేసిందెవరో మరి ?

అస్సాం ఎన్నికల్లో అప్పర్ అస్సాం లోని శివ్ సాగర్ నియోజకవర్గం నుంచి ఓ అభ్యర్థి పోటీ చేసి గెలిచాడు. ఇందులో విశేషమేమీ లేదు. కానీ ఈ అభ్యర్థి జైల్లో ఉండడమే పెద్ద విశేషం.

అస్సాం ఎన్నికలు, జైల్లో ఉన్నా పోటీ చేసి బీజేపీ అభ్యర్థిపై  గెలిచాడు, ప్రచారం చేసిందెవరో మరి ?
Jailed Activist Akhil Gogoi Wins Polls In Assam
Follow us

| Edited By: Phani CH

Updated on: May 03, 2021 | 5:47 PM

అస్సాం ఎన్నికల్లో అప్పర్ అస్సాం లోని శివ్ సాగర్ నియోజకవర్గం నుంచి ఓ అభ్యర్థి పోటీ చేసి గెలిచాడు. ఇందులో విశేషమేమీ లేదు. కానీ ఈ అభ్యర్థి జైల్లో ఉండడమే పెద్ద విశేషం. ఈ ఎన్నికల్లో  అఖిల్ గొగోయ్ అనే ఈయన విజయం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అసలు ఈయన జైల్లో ఎందుకు ఉన్నాడంటే..పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ) కు వ్యతిరేకంగా 2019 లో జరిగిన నిరసన ప్రదర్శనల్లో గొగోయ్ పాల్గొన్నాడట. ఇందుకు పోలీసులు అరెస్టు చేసి ఇతడ్ని జైలుకు పంపారు. ఆ ఏడాది డిసెంబరు నుంచి అఖిల్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. గత ఏడాది అక్టోబరులో రాయ్ జోర్దళ్ అనే పార్టీని ఏర్పాటు చేశాడు. అస్సాం ఎన్నికల్లో ఈయన తన సమీప బీజేపీ అభ్యర్థిపై 11,875 ఓట్ల ఆధిక్యతతో గెలిచాడు. ఇతనికి కృషక్  ముక్తి సంగ్రామ్ అనే రైతు సంస్థతో బాటు సీఏఎ కు వ్యతిరేకంగా నాడు జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న సంస్థలు కూడా మద్దతు ప్రకటించాయి. అఖిల్ పార్టీ ఈ ఎన్నికల్లో 18 సీట్లకు పోటీ చేసింది.కొత్తగా ఏర్పడిన అస్సాం జాతీయ పరిషద్ తో ఇతని పార్టీ పొత్తు పెట్టుకుంది. అఖిల్ కి 46.6 శాతం ఓట్లు , బీజేపీ అభ్యర్థికి 30 కి పైగా శాతం ఓట్లు వచ్చినట్టు ఈసీ ప్రకటించింది.

శివ్ సాగర్ నియోజకవర్గ ప్రజలు తన భర్తపై పెట్టుకున్న ఆశలవల్లే ఈ ఎన్నికల్లో ఆయన గెలిచాడని అఖిల్ భార్య చెబుతోంది. దేశ ద్రోహం కింద 2019 లో జైలు పాలైన అఖిల్ గొగోయ్ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. ఇండిపెండెంటుగా పోటీచేసిన ఇతని తరఫున ఇతని తల్లి 84 ఏళ్ళ ప్రియదా గొగోయ్ ప్రచారం చేసిందంటే నమ్మలేం.కానీ తన వయస్సును కూడాలెక్క చేయకుండా  ఆమె తన కొడుకు కోసం ప్రచారం చేయడమే విశేషం. ఆమెతో బాటు ఇతని ఇతర కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఇతని ఫోటో పెట్టుకుని కాంపెయిన్ నిర్వహించారట,  మరి ఓటర్లకు ఏం హామీలు ఇచ్చాడంటే తెలియదు కానీ మొత్తానికి అఖిల్ గొగోయ్ విజయం సాధించాడు. ముఖ్యంగా స్థానిక సమస్యల పరిష్కారానికి, నిరుద్యోగుల సమస్యలు తీర్చడానికి తాను కృషి చేస్తానని ఈయన హామీ ఇచ్చాడని తెలిసింది. మరి ఈ 40 ఏళ్ళ బుడ్డ ఎమ్మెల్యే జైలు నుంచి ఎప్పుడు తిరిగి వస్తాడో మరి

మరిన్ని ఇక్కడ చూడండి: Telangana Municipalities Elections Results 2021 LIVE: తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు.. విజేతలు వీరే..!

ఎన్టీఆర్‏కు ఆ సీనియర్ హీరో… మరోసారి బ్లాక్ బస్టర్ కోసం స్క్రిప్ట్‏లో మార్పులు చేస్తున్న కొరటాల..