ఎన్నికల ప్రచారంలో జగన్ హామీలు

తిరువూరు: కృష్ణా జిల్లా తిరువూరులో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు పలు హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్ధులందరినీ తాము చదివిస్తామని, అందరికీ ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని చెప్పారు. ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగాలకు క్యాలెండర్ విడుదల చేస్తామని జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు, కొత్తగా వచ్చే పరిశ్రమలు అన్నింటిలో […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:07 pm, Sun, 24 March 19
ఎన్నికల ప్రచారంలో జగన్ హామీలు

తిరువూరు: కృష్ణా జిల్లా తిరువూరులో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు పలు హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్ధులందరినీ తాము చదివిస్తామని, అందరికీ ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని చెప్పారు. ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగాలకు క్యాలెండర్ విడుదల చేస్తామని జగన్ వెల్లడించారు.

రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు, కొత్తగా వచ్చే పరిశ్రమలు అన్నింటిలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేసి అమలు చేస్తామని జగన్ వెల్లడించారు. ఆ పరిశ్రమల్లో పని చేసేందుకు తగిన విధంగా యువకులను తయారు చేసేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో తర్ఫీదు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తాం. అందులో స్థానిక గ్రామ పిల్లలు పది మందికి ఉద్యోగాలిస్తామని జగన్ చెప్పారు.

పెన్షన్, ఇల్లు, రేషన్ కార్డు.. నవరత్నాల్లో ఏ పథకం కావాలన్నా ఈ గ్రామ సచివాలయాల్లో అప్లికేషన్ పెడితే, పెట్టిన 75 గంటల్లోనే పనయ్యేలా ఏర్పాటు చేస్తాం. గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలెంటీర్‌గా ఉద్యోగమిస్తాం. ఆ వాలెంటీర్‌కు ఐదు వేలు గౌరవ వేతనం ఇస్తాము. ఈ వాలెంటీర్ గ్రామ సచివాలయానికి గ్రామ ప్రజలకు అనుసంధానంగా ఉంటారని జగన్ వివరించారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనులన్నీ నిరుద్యోగ యువతీ యువకులకు ఇస్తాము. అందులోనూ ఈ కాంట్రాక్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం ఇస్తాం. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన వారికే కేంద్రంలో మద్దతిస్తామని జగన్ చెప్పారు.