AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyper Aadi: ఆ రోజుల్లో లేడీస్ హాస్టల్‌లో ఎవరికీ కనపడకుండా ఉండేవాడిని.! సిగ్గుగా అనిపించేది..

టాలీవుడ్ నటుడు హైపర్ ఆది తన సినీ కెరీర్, కష్టాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తూనే, కుటుంబ అప్పులు తీర్చడానికి పొలం అమ్మాను. ఉద్యోగం వదిలి జబర్దస్త్‌లో చేరానన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చెక్ చేయండి.

Hyper Aadi: ఆ రోజుల్లో లేడీస్ హాస్టల్‌లో ఎవరికీ కనపడకుండా ఉండేవాడిని.! సిగ్గుగా అనిపించేది..
Hyper Aadi
Ravi Kiran
|

Updated on: Jan 31, 2026 | 9:49 AM

Share

టాలీవుడ్ నటుడు హైపర్ ఆది తన కష్టకాలం, విజయాల వెనుక ఉన్న అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. బీటెక్ 80 శాతం మార్కులతో పూర్తి చేసి, ఒక కంపెనీలో ఉద్యోగం చేశానన్నాడు. అయితే, ముగ్గురు సోదరుల చదువుల కోసం కుటుంబం చేసిన దాదాపు 20 లక్షల అప్పును తీర్చడానికి అతడి జీతం సరిపోలేదు. జాబ్ సంతృప్తికరంగా లేకపోవడంతో, ఆ అప్పును తీర్చాలనే ఆలోచనతో తన కుటుంబానికి చెందిన మూడు ఎకరాల పొలాన్ని అమ్మకం పెట్టానని చెప్పాడు.

ఉద్యోగంపై ఆసక్తి లేకపోవడంతో.. శని, ఆదివారాల్లో కృష్ణకాంత్ పార్క్‌లో ఫోన్‌తో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసి యూట్యూబ్‌లో పెట్టేవాడట. అత్తారింటికి దారేది క్లైమాక్స్ స్పూఫ్‌కు లక్ష వ్యూస్ రావడంతో, అదిరే అభి నుంచి మెసేజ్ వచ్చిందని.. తద్వారా జబర్దస్త్‌లోకి అడుగుపెట్టానని హైపర్ ఆది తెలిపాడు. తాను ఉద్యోగం మానేసిన తర్వాత తల్లిదండ్రులు బాధపడ్డారని చెప్పుకొచ్చాడు. జబర్దస్త్‌లో మొదట చిన్న రోల్స్ చేశాక, బంధువులు విమర్శించారు. మూడు-నాలుగు నెలలు ఇంటికి ఫోన్ చేయలేదు. కష్ట కాలంలో బంధువుల లేడీస్ హాస్టల్‌లో కింద గదిలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉన్నాను.

కేవలం ఆర్టిస్ట్‌గా నెట్టుకురావడం కష్టం అని తెలుసుకుని, స్కిట్‌లకు డైలాగులు రాయడం మొదలుపెట్టానని హైపర్ ఆది తెలిపాడు. అభి అన్న లేని సమయంలో ఒక స్కిట్‌కు పూర్తిగా డైలాగులు రాసి హిట్ కొట్టానన్నాడు హైపర్ ఆది. ఆ తర్వాత రైటర్‌గా, ఆర్టిస్ట్‌గా ఎదిగి, చివరకు నాగబాబు, రోజా, నితిన్ భరత్ లాంటివారి ప్రోత్సాహంతో టీమ్ లీడర్‌గా మారానని చెప్పుకొచ్చాడు. అప్పు తీర్చడానికి అమ్మిన పొలం కంటే ఎక్కువ భూమిని తిరిగి కొనుగోలు చేయడంతో పాటు.. ఆర్ధికంగా కూడా స్థిరపడ్డానని స్పష్టం చేశాడు హైపర్ ఆది.

ఇది చదవండి:  ఆ డైరెక్టర్ ఐదుగురు అమ్మాయిలతో ఓ రాత్రి గడిపారని చెప్పాడు.. అది విని షాకయ్యా

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే