ఎంతవరకైనా కష్టపడతా, సంపద సృష్టిస్తా: చంద్రబాబు

రాయచోటి: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయచోటిలో ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి కోసం తాను ఎంతవరకైనా కష్టపడతానని, సంపద సృష్టిస్తానని చెప్పారు. ఆ సృష్టించిన సంపదను మళ్లీ ప్రజలకే ఇస్తానని అన్నారు. ఆస్తులను వదులుకుని కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాం. వృద్ధులకు రూ. 200 పింఛన్‌ను రూ. 2 వేలకు పెంచి భరోసా కల్పించాం. టీఆర్ఎస్‌కు జగన్ బీ టీంగా తయారయ్యారు. నరంద్ర మోడీని చూస్తే జగన్‌కు వెన్నులో వణుకు పడుతుందంటూ […]

  • Ram Naramaneni
  • Publish Date - 5:12 pm, Sun, 24 March 19
ఎంతవరకైనా కష్టపడతా, సంపద సృష్టిస్తా: చంద్రబాబు

రాయచోటి: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయచోటిలో ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి కోసం తాను ఎంతవరకైనా కష్టపడతానని, సంపద సృష్టిస్తానని చెప్పారు. ఆ సృష్టించిన సంపదను మళ్లీ ప్రజలకే ఇస్తానని అన్నారు. ఆస్తులను వదులుకుని కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాం. వృద్ధులకు రూ. 200 పింఛన్‌ను రూ. 2 వేలకు పెంచి భరోసా కల్పించాం. టీఆర్ఎస్‌కు జగన్ బీ టీంగా తయారయ్యారు. నరంద్ర మోడీని చూస్తే జగన్‌కు వెన్నులో వణుకు పడుతుందంటూ చంద్రబాబు విమర్శించారు.

అన్నదాత సుఖీభవ, కౌలు రైతుకు పెట్టుబడి, చంద్రన్న భీమా, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాము. మైనార్టీలకు ఏం కావాలన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వైసీపీకి ఓటేస్తే అది మోడీ ఖాతాలోకి వెళుతుంది. మోడీ ప్రధాని అయితే ముస్లింలకు భద్రత ఉండదని చంద్రబాబు అన్నారు.

తాను కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్లిచ్చాను. కానీ మీరు పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలని కోర్టుకెళ్లారు. ప్రాజెక్టు పూర్తి కాకుండా అడ్డుపడ్డారు. రాజధానికి అడ్డుపడ్డారు. ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒకే ఒక సమస్య జగన్ అని చంద్రబాబు విమర్శించారు.