కర్ణాటక మంత్రి ఇంటిపై ఐటీ దాడులు

కర్ణాటకలో అధికార పార్టీ నేతలపై ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి సీఎస్ పుట్టరాజు నివాసంలో గురువారం ఐటీ అధికారులు దాడులు చేశారు. ఉదయం 5గంటలకు పుట్టరాజు స్వగ్రామం చినకురులికి చేరుకున్న ఐటీ అధికారులు అక్కడ సోదాలు నిర్వహించారు. అలాగే మాండ్యాలో పుట్టరాజుకు సంబంధించిన ఆస్తులపైనా, మైసూరులో ఆయన బంధువు ఇంటిలోనూ సోదాలు జరుగుతున్నాయి. కాగా ఈ దాడులను పుట్టరాజు ధృవీకరించారు. తన ఇంట్లో సోదాలు జరిగాయని ఆయన అన్నారు. […]

కర్ణాటక మంత్రి ఇంటిపై ఐటీ దాడులు
Follow us

| Edited By: Vijay K

Updated on: Mar 28, 2019 | 6:59 PM

కర్ణాటకలో అధికార పార్టీ నేతలపై ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి సీఎస్ పుట్టరాజు నివాసంలో గురువారం ఐటీ అధికారులు దాడులు చేశారు. ఉదయం 5గంటలకు పుట్టరాజు స్వగ్రామం చినకురులికి చేరుకున్న ఐటీ అధికారులు అక్కడ సోదాలు నిర్వహించారు. అలాగే మాండ్యాలో పుట్టరాజుకు సంబంధించిన ఆస్తులపైనా, మైసూరులో ఆయన బంధువు ఇంటిలోనూ సోదాలు జరుగుతున్నాయి.

కాగా ఈ దాడులను పుట్టరాజు ధృవీకరించారు. తన ఇంట్లో సోదాలు జరిగాయని ఆయన అన్నారు. ‘‘10కోట్ల ఆస్తికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి. ఈ దాడులకు నేనేం భయపడను. ఈ దాడుల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు’’ అంటూ ఆయన ఆరోపించారు. కాగా జేడీఎస్ పార్టీతో అనుబంధం ఉన్న వ్యాపార‌వేత్త‌లు, నేత‌ల‌పైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి. సుమారు 20 ప్రాంతాల్లో ఐటీశాఖ త‌నిఖీలు చేస్తోంది. సీఎం సోద‌రుడు, మంత్రి రేవ‌ణ్ణ అనుచరుల ఇండ్ల‌లోనూ ఐటీ సోదాలు జ‌రుగుతున్నాయి..