మిస్టర్ కూల్ పేరు మిస్…

గులాబీ దళంలో పదవుల పందేరం మొదలైంది. పదవుల కోసం పెద్ద క్యూ వెయిటింగ్ లో ఉంది. దాంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిగిన సభా కమిటీలను నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ బడ్జెట్ సమావేశంలోనే కమిటీ చైర్మన్ లను, సభ్యులను స్పీకర్ ప్రకటించబోతున్నారు. ఇటు త్వరలోనే కార్పొరేషన్ చైర్మన్ పదవులను కూడా భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నేతలు జూపల్లి క్రిష్ణారావు, మధుసూదనాచారికి త్వరలోనే కీలక పదవులు ఇస్తారని తెలుస్తోంది. మాజీ […]

మిస్టర్ కూల్ పేరు మిస్...
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 9:34 PM

గులాబీ దళంలో పదవుల పందేరం మొదలైంది. పదవుల కోసం పెద్ద క్యూ వెయిటింగ్ లో ఉంది. దాంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిగిన సభా కమిటీలను నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ బడ్జెట్ సమావేశంలోనే కమిటీ చైర్మన్ లను, సభ్యులను స్పీకర్ ప్రకటించబోతున్నారు. ఇటు త్వరలోనే కార్పొరేషన్ చైర్మన్ పదవులను కూడా భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

గత ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నేతలు జూపల్లి క్రిష్ణారావు, మధుసూదనాచారికి త్వరలోనే కీలక పదవులు ఇస్తారని తెలుస్తోంది. మాజీ మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నరసింహారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లకు ఉన్నతపదవులు ఇవ్వబోతున్నారు. వీరిలో కొందరికి రాజ్యసభ సభ్యత్వం, మరికొందరికి ఆర్టీసీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ లాంటి పదవులు దక్కే అవకాశం ఉంది.అయితే ఈ లిస్ట్ లో మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి పేరు మాత్రం మిస్ అయింది. KR Reddy

అసెంబ్లీ ఎన్నికలకు ముందు సురేష్ రెడ్డి గులాబీ గూటికి చేరారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధుల గెలుపు కోసం తనవంతు ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు. ఈయనకు కీలక పదవి ఇస్తారని చాలా రోజులుగా ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పుడు లిస్ట్ లో ఈయన పేరు లేకపోవడంతో అనుచరుల్లో ఆందోళన మొదలైంది.

నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్ కు ఇచ్చిన అంతర్రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి ఇస్తామని గులాబీ హై కమాండ్ ఆఫర్ ఇచ్చిందట. అయితే ఆ పదవి కాకుండా రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి కావాలని అడిగారట. అయితే.. డీఎస్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆ ఎంపీ సీటు ఇస్తామని మరో ప్రపోజల్ పెట్టారట. ఆయన రాజీనామా ఎప్పుడు చేస్తారో.. తనకు సీటు ఎప్పుడు వస్తుందో తెలియక సురేష్ రెడ్డి పరేషాన్ అవుతున్నారంట. దాంతో కొంతకాలం వెయిట్ చేసి, పార్టీ మారాలనే ఆలోచనలో సురేష్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.