గంటాకు ‘చిరు’ మాటే వేదమా..?

రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు రూటే సపరేటు. టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గంటా.. ఆ పార్టీ తరఫున 1999లో ఎంపీగా, 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికల సమయంలో అనూహ్యంగా చిరు ప్రారంభించిన ప్రజారాజ్యంలోకి చేరి.. ఆ పార్టీ తరఫున కూడా మరోమారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయగా.. అప్పటి మాజీ సీఎం కిరణ్ […]

గంటాకు 'చిరు' మాటే వేదమా..?
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 07, 2019 | 7:47 PM

రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు రూటే సపరేటు. టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గంటా.. ఆ పార్టీ తరఫున 1999లో ఎంపీగా, 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికల సమయంలో అనూహ్యంగా చిరు ప్రారంభించిన ప్రజారాజ్యంలోకి చేరి.. ఆ పార్టీ తరఫున కూడా మరోమారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయగా.. అప్పటి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో గంటాకు మంత్రి లభించింది. ఇక ఆ తరువాత 2014 ఎన్నికల సమయంలో మళ్లీ టీడీపీలో చేరి.. చంద్రబాబు హయాంలోనూ ఆయన మంత్రి పదవిని సంపాదించుకున్నారు. అయితే ఈ సారి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆయన గెలిచినప్పటికీ.. టీడీపీ ఓటమి పాలవ్వడంతో ఆయన హవా కాస్త తగ్గింది.

ఇప్పటికే టీడీపీలోని కీలక నేతలందరూ ఆ పార్టీని వీడి మిగిలిన పార్టీల్లో చేరగా.. గంటా కూడా ఆ పార్టీని వీడేందుకు సన్నాహాలు చేస్తున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వైసీపీలో చేరేందుకు గంటా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడని ఆ మధ్యన పుకార్లు షికార్లు చేశాయి. దానికి తోడు వైసీసీలో తాను చేరాలనుకుంటే తనను ఎవ్వరూ అడ్డుకోలేరంటూ గంటా కూడా కామెంట్లు చేశారు. అయితే ఆయన వైసీపీలో ఎప్పుడు చేరుతారు..? ఏంటన్నది..? ఇంకా తేలలేదు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో గంటా చిరంజీవి వెంట ఎక్కువగా కనిపిస్తున్నారు. అల్లు ఫ్యామిలీ సైరా టీంకు ఇచ్చిన పార్టీకి గంటా శ్రీనివాస్ వెళ్లి అక్కడ సందడి చేశారు. అలాగే ఆదివారం ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ తాడేపల్లిగూడెంలో జరగగా.. అక్కడకు కూడా వెళ్లి.. చిరు పక్కన ఉంటూ హల్‌చల్ చేశారు. దీంతో గంటా నెక్ట్స్ స్టెప్ ఏంటి..? అన్న చర్చ ఇప్పుడు రాజకీయాల్లో జరుగుతోంది. మరోవైపు చిరు సూచించినట్లే గంటా రాజకీయాల్లో తదుపరి అడుగులు వేయనున్నాడా..? అన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే రాజకీయాల గురించి పక్కనపెడితే.. చిరు, గంటా కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. చిరు కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగినా.. గంటా కుటుంబం వెళ్తూ వస్తోంది. అలాగే గంటా ఫ్యామిలీలో జరిగే కార్యక్రమాల్లో చిరు కుటుంబం కూడా సందడి చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే మొన్న అల్లు ఫ్యామిలీ పార్టీలో.. నిన్న చిరు తాడేపల్లిగూడెం పర్యటనలో గంటా సందడి చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..