కమలం గూటికి గంటా.. ముహూర్తం కూడా కన్‌ఫర్మ్ !

గత కొన్ని రోజులుగా టిడిపితో అంటీ ముట్టనట్లుంటున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు.. బిజెపి గూటికి చేరడం ఖాయమైందా ? పరిణామాలు.. అంతర్గత సమాచారం పరిశీలిస్తే కన్‌ఫర్మ్ అనిపిస్తోందంటున్నారు పొలిటికల్ ఆబ్జర్వర్లు. గంటా పొలిటికల్ జర్నీలో ట్రాక్ చేంజ్ ప్రక్రియ నెల రోజుల క్రితమే మొదలైందని చెబుతున్నారు ఆయన అనుచరులు కూడా.. ఇంతకీ ఆయన జర్నీ ఏ వైపు ? గంటా శ్రీనివాస్ రావు.. ఆయన రూటే సెపరేటు. గంటా ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. […]

కమలం గూటికి గంటా.. ముహూర్తం కూడా కన్‌ఫర్మ్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 07, 2019 | 8:31 PM

గత కొన్ని రోజులుగా టిడిపితో అంటీ ముట్టనట్లుంటున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు.. బిజెపి గూటికి చేరడం ఖాయమైందా ? పరిణామాలు.. అంతర్గత సమాచారం పరిశీలిస్తే కన్‌ఫర్మ్ అనిపిస్తోందంటున్నారు పొలిటికల్ ఆబ్జర్వర్లు. గంటా పొలిటికల్ జర్నీలో ట్రాక్ చేంజ్ ప్రక్రియ నెల రోజుల క్రితమే మొదలైందని చెబుతున్నారు ఆయన అనుచరులు కూడా.. ఇంతకీ ఆయన జర్నీ ఏ వైపు ?

గంటా శ్రీనివాస్ రావు.. ఆయన రూటే సెపరేటు. గంటా ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం తర్వాత మంత్రి అయ్యారు. 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో విశాఖ నార్త్‌ నుంచి పోటీ చేసిన గంటా ఓడిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ స్వల్ప మెజార్టీతో ఆయన గెలిచారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో….గంటా పార్టీ మారుతారని ఆరునెలల నుంచి ఊహగానాలు విన్పిస్తున్నాయి. ఓ సారి ఆయన వైసీపీలో చేరుతారని.. మరోసారి బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే గంటా మాత్రం తన మనసులో మాటను బయటపెట్టలేదు.

ఇటీవల సైరా సినిమా విడుదల సందర్భంగా చిరంజీవి వెళ్లి ఏపీ సీఎం జగన్‌ను కలిశారు. ఈ మీటింగ్‌లో గంటా కూడా పాల్గొంటారని ప్రచారం జరిగింది. అయితే ఆ మీటింగ్‌కు గంటా వెళ్లలేదు. ఆ తర్వాత ఆయన రాంమాధవ్‌తో దిగిన ఫోటో వైరల్‌ అయింది. దీంతో గంటా చూపు బీజేపీపై పడింది అని న్యూస్‌లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు టీడీపీ సర్వసభ్య సమావేశానికి కూడా గంటా హాజరుకాకపోవడంతో పార్టీలో ఆయన మీద టీడీపీ నేతల్లో డౌట్లు మొదలయ్యాయి. గంటా పార్టీ మారడం ఖాయమని వారే గుసగుసలు ఆడుకుంటున్నారు. మరీ గంటా దారెటు? ఆయన ఏ కండువా కప్పుకుంటారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే.. గంటా శ్రీనివాస్ రావు తొలుత బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో కొన్ని రోజుల క్రితం భేటీ అయ్యారు. ఆ భేటీలోనే ఆయన బిజెపిలో చేరడం దాదాపు కన్‌ఫర్మ్ అయినట్లు సమాచారం. అయితే.. ఇద్దరి మధ్య భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి, గంటా వ్యక్తిగత డిమాండ్లకు సంబంధించి పెద్ద చర్చనే జరిగినట్లు తెలుస్తోంది. దాంతో బిజెపి జాయినింగ్‌కి ఓ ఫార్ములా రూపొందించినట్లు చెబుతున్నారు. దీనిపై మంగళ, బుధవారాల్లో ఏపీ బిజెపి నేతలు సమాలోచనలు జరిపినట్లు చెబుతున్నారు. బిజెపి వర్గాల సమాచారం ప్రకారం ఏపీ బిజెపి నేతలతో జరిగిన సమాలోచనలలో గంటా కూడా భాగస్తులయ్యారని అంటున్నారు.
ఈ సమాలోచనలలో రూపొందిన ఫార్ములా ప్రకారం నవంబర్ 10 లేదా 11 తేదీలలో APకి రానున్న బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి. నడ్డాతో రాష్ట్ర బిజెపి నేతలు గంటా వ్యవహారంపై చర్చించనున్నారు. రాం మాధవ్‌తో జరిగిన భేటీలో ప్రస్తావనకొచ్చిన కీలకాంశాలతోపాటు మంగళ, బుధవారాల్లో రాష్ట్ర నాయకుల ముందు గంటా శ్రీనివాస్ రావు ప్రస్తావించిన అంశాలను నడ్డాకు వివరిస్తారు. ఆ తర్వాత జె.పి. నడ్డా నిర్ణయంపై గంటా చేరిక ఆధారపడి వుందని బిజెపి వర్గాలంటున్నాయి.
గంటా డిమాండ్లకు నడ్డా ఓకే చెబితే.. ఆ తర్వాత వారం, పదిరోజుల్లో బిజెపి చీఫ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో గంటా శ్రీనివాస్ రావు కాషాయతీర్థం పుచ్చుకుంటారని తాజా సమాచారం. సో.. మరో పది, పదిహేను రోజుల్లో గంటా జర్నీ బిజెపి తీరాన్ని చేరనుందన్నమాట.

భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!