డీజీపీకి ఘాటుగా చంద్రబాబు లేఖ..!

ఏపీ డీజీపీ సవాంగ్‌కు.. మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వంపై చేస్తోన్న అరాచకాలు మీకు తెలియాలని లేఖ రాస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని.. కనీసం వాక్ స్వాతంత్ర్యం కూడా లేదని వైసీపీ గవర్నమెంటును విమర్శిస్తూ.. బాబు, డీజీపీకి లేఖ రాశారు. ‘రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని మాజీ సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీజీపీకి రెండు పేజీల […]

డీజీపీకి ఘాటుగా చంద్రబాబు లేఖ..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 25, 2019 | 8:36 PM

ఏపీ డీజీపీ సవాంగ్‌కు.. మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వంపై చేస్తోన్న అరాచకాలు మీకు తెలియాలని లేఖ రాస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని.. కనీసం వాక్ స్వాతంత్ర్యం కూడా లేదని వైసీపీ గవర్నమెంటును విమర్శిస్తూ.. బాబు, డీజీపీకి లేఖ రాశారు. ‘రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని మాజీ సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీజీపీకి రెండు పేజీల లేఖ రాశారు. అధికార పార్టీ ప్రతినిధులు శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రజలపై, మీడియా ప్రతినిధులపై దాడులు కొనసాగుతున్నాయని చంద్రబాబు అన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకుండా చర్యలు’ తీసుకోవాలని డీజీపీని కోరారు. ఐయామ్ వేరీ సారీ.. మీకు ఈ విధంగా లెటర్‌ రాసే దౌర్భాగ్యం వచ్చిందని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.