’శ్రీకళారెడ్డి‘ ఎవరు..?

కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్. ఈ కోటను బద్దలు కొట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటు వరుస విజయాలు కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. అలాగే బీజేపీ కూడా బలమైన అభ్యర్థి శ్రీకళారెడ్డిని రంగంలోకి దించబోతుంది. ఇంతకీ శ్రీకళారెడ్డి ఎవరు? కీసర శ్రీకళారెడ్డి బీజేపీ హుజూర్ నగర్ అభ్యర్థి. పేరు కొత్తగా వినిపిస్తోంది. కానీ ఈమె కుటుంబం హుజూర్ నగర్ కి కొత్త కాదు. తండ్రి జితేంద్రరెడ్డి 1972లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా […]

’శ్రీకళారెడ్డి‘ ఎవరు..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajesh Sharma

Updated on: Sep 26, 2019 | 5:58 PM

కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్. ఈ కోటను బద్దలు కొట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటు వరుస విజయాలు కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. అలాగే బీజేపీ కూడా బలమైన అభ్యర్థి శ్రీకళారెడ్డిని రంగంలోకి దించబోతుంది. ఇంతకీ శ్రీకళారెడ్డి ఎవరు?

కీసర శ్రీకళారెడ్డి బీజేపీ హుజూర్ నగర్ అభ్యర్థి. పేరు కొత్తగా వినిపిస్తోంది. కానీ ఈమె కుటుంబం హుజూర్ నగర్ కి కొత్త కాదు. తండ్రి జితేంద్రరెడ్డి 1972లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా గెలిచారు. ఆమె భర్త ధనుంజయ్ యూపీ నుంచి గతంలో ఎంపీగా పనిచేశారు. ఇలా ఆమె ఫ్యామిలీ నుంచి గతంలో ప్రజాప్రతినిధులు చట్ట సభల్లోకి వెళ్లారు. ఈమె కూడా రాజకీయాల్లో రాణించేందుకు ఎప్పటినుంచో తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొనే శ్రీకళారెడ్డిని హుజూర్ నగర్ లో బలమైన అభ్యర్థిగా బీజేపీ భావిస్తోంది.

రాజకీయాలపై ఆసక్తి ఉన్న శ్రీకళారెడ్డి 2004 టీడీపీలో చేరారు. అక్కడ నుంచే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే కావాలనే కోరికతో కోదాడ టీడీపీ టిక్కెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ టీడీపీలో టిక్కెట్ రాకపోవడంతో వైసీపీలో చేరారు. తర్వాత రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్ రావుతో కలిసి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఏకంగా హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు.