భిక్షాటన చేస్తూ రైతుల వినూత్న ప్రచారం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమ సమస్యలను జాతీయ స్థాయిలో ప్రతిబింబించడానికి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని పసుపు, ఎర్రజొన్న రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నిజామాబాద్ ఎన్నికపై దేశ ప్రజలందరూ ఆసక్తిగా చూస్తున్నారు. వినూత్న నిరసనతో దేశం దృష్టిని ఆకర్షించిన అన్నదాతలు, మద్దతు కూడగట్టడానికి రంగంలోకి దిగారు. రైతులు, రైతుకూలీలు ప్రజల మద్దతు కోరుతూ సోమవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆర్మూర్ మండలంలోని […]

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమ సమస్యలను జాతీయ స్థాయిలో ప్రతిబింబించడానికి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని పసుపు, ఎర్రజొన్న రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నిజామాబాద్ ఎన్నికపై దేశ ప్రజలందరూ ఆసక్తిగా చూస్తున్నారు. వినూత్న నిరసనతో దేశం దృష్టిని ఆకర్షించిన అన్నదాతలు, మద్దతు కూడగట్టడానికి రంగంలోకి దిగారు. రైతులు, రైతుకూలీలు ప్రజల మద్దతు కోరుతూ సోమవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆర్మూర్ మండలంలోని దేగాం, ముప్కాల్ మండలంలోని కొత్తపల్లి గ్రామాలకు వెళ్లారు. ఈ సందర్భంగా తాము చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వీరి ప్రచారానికి కొన్ని గ్రామాల్లోని రైతుసంఘాల ప్రతినిధుల నుంచి మద్దతు లభించింది. వీరికి మద్దతుగా ఉంటామని ఆయా సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. అభ్యర్థుల వెంట ప్రచారానికి తమ సభ్యులను పంపుతామని హామీ ఇచ్చారు. మరోవైపు జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లోనూ రైతులు భిక్షాటన చేశారు. ఎన్నికల్లో తాము పోటీచేయడమే కాదు, ప్రచారం చేస్తున్నామని తెలిపారు. రైతులకే ఓట్లను వేయించి విజయం సాధించే దిశగా ప్రజల సహకారాన్ని కోరుతున్నామని వెల్లడించారు.