కేంద్ర మంత్రికి ఎన్నికల సంఘం హెచ్చరిక

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి మేనకాగాంధీపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుల్తాన్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఈసీ.. ఘాటుగా స్పందించింది. ఆమె వ్యాఖ్యలు తీవ్ర అభ్యంత్రకరం అని పేర్కొంది. హద్దుమీరి ప్రసంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా మేనకా గాంధీ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 14వ తేదీన అక్కడ ఎన్నికల […]

కేంద్ర మంత్రికి ఎన్నికల సంఘం హెచ్చరిక
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2019 | 7:07 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి మేనకాగాంధీపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుల్తాన్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఈసీ.. ఘాటుగా స్పందించింది. ఆమె వ్యాఖ్యలు తీవ్ర అభ్యంత్రకరం అని పేర్కొంది. హద్దుమీరి ప్రసంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా మేనకా గాంధీ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 14వ తేదీన అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె.. ముస్లిం ఓటర్లను భయపెట్టేలా ప్రసంగించారు. తనకు ఓటు వేయకపోతే తగిన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అవి ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఈ ప్రసంగానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది చివరికి ఈసీ దృష్టిలో పడింది. ఈ వ్యాఖ్యలను సుమోటోగా భావించిన ఈసీ.. మేనకాగాంధీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.