పోలింగ్ సమయం పొడిగింపు

ఎన్నికల వేళ‌ సాధారణంగా పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే గంట ముందే ముగుస్తుంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పోలింగ్ సమయాన్ని అదనంగా మరో గంట పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓటుహక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈసారి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ […]

పోలింగ్ సమయం పొడిగింపు
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2019 | 9:08 AM

ఎన్నికల వేళ‌ సాధారణంగా పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే గంట ముందే ముగుస్తుంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పోలింగ్ సమయాన్ని అదనంగా మరో గంట పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓటుహక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈసారి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపింది. పోలింగ్ సమయం పెంపునకు కారణాలను కూడా ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్‍లో గుర్తు ఏడు సెకన్ల పాటు కనిపిస్తుందని, దీంతో పోలింగ్‌కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. వేసవి కావడంతో సాయంత్రం సమయాల్లో ఓటర్లు ఎక్కువగా పోలింగ్‌కు వచ్చే అవకాశం ఉందని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈసారి పోలింగ్‌ సమయాన్ని మరో గంట పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లందరూ తమ ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది.