బీజేపీకి ఫేస్ బుక్ సహకరిస్తోందా?

బీజేపీ తెరవెనుక అధికార బలంతో ప్రతిపక్ష కాంగ్రెస్ సోషల్ మీడియా క్యాంపెయిన్ ను నియంత్రిస్తోందన్న వాదనలకు బలం చేకూరే సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కాంగ్రెస్ వాదులు నిర్వహిస్తున్న దాదాపు 138 పేజీలు, 549 యాక్టివ్ అకౌంట్లను తొలగించినట్టు ప్రకటించింది. ఈ మేరకు గుర్తించిన కాంగ్రెస్ సెల్ ఈ చర్యను తీవ్రంగా తప్పుపట్టింది. రాజకీయ కక్షతోనే ఫేస్ బుక్ సాయంతో బీజేపీ తమ విలువైన అకౌంట్లు, పేజీలను తొలగించిందని కాంగ్రెస్ ఆరోపించింది. […]

బీజేపీకి ఫేస్ బుక్ సహకరిస్తోందా?
Follow us

| Edited By:

Updated on: Apr 07, 2019 | 7:24 PM

బీజేపీ తెరవెనుక అధికార బలంతో ప్రతిపక్ష కాంగ్రెస్ సోషల్ మీడియా క్యాంపెయిన్ ను నియంత్రిస్తోందన్న వాదనలకు బలం చేకూరే సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కాంగ్రెస్ వాదులు నిర్వహిస్తున్న దాదాపు 138 పేజీలు, 549 యాక్టివ్ అకౌంట్లను తొలగించినట్టు ప్రకటించింది. ఈ మేరకు గుర్తించిన కాంగ్రెస్ సెల్ ఈ చర్యను తీవ్రంగా తప్పుపట్టింది. రాజకీయ కక్షతోనే ఫేస్ బుక్ సాయంతో బీజేపీ తమ విలువైన అకౌంట్లు, పేజీలను తొలగించిందని కాంగ్రెస్ ఆరోపించింది.

అయితే నకిలీ వార్తలు పుకార్లను అరికట్టే పేరిట ఫేస్ బుక్ కేవలం కాంగ్రెస్ అకౌంట్లు, పేజీలనే తొలగించడం వివాదాస్పదమైంది. ఇది బీజేపీకి పరోక్షంగా ప్రయోజనం చేకూర్చేలా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అకౌంట్ల తొలగింపు వల్ల కాంగ్రెస్ పార్టీకి భారీగా నష్టం జరుగుతుండగా.. బీజేపీ లాభపడుతోంది.

ప్రస్తుతం దేశంలో సోషల్ మీడియా ప్రచారంలో బీజేపీ.. అందులోనూ మోదీ చురుగ్గా ఉన్నారు. 2014లో కూడా సోషల్ మీడియాతో పెద్ద ఎత్తున ప్రచారం చేసి మోదీ గెలిచారు. ఈసారి కాంగ్రెస్ కూడా సోషల్ మీడియాను వాడేందుకు రెడీ కాగా.. ఆపార్టీ అకౌంట్లను ఫేస్ బుక్ రద్దు చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది.

ప్రస్తుతం దేశంలోని కార్పొరేట్ కంపెనీలు… సోషల్ మీడియా దిగ్గజాలు.. అమెరికా ఆధారిత కంపెనీలు ప్రముఖ వెబ్ సైట్ల నుంచి బీజేపీకి విరాళాల వాన కురిస్తోందట.. ఆ కోవలోనే వాటిని మేనేజ్ చేసి బీజేపీ కార్పొరేట్లతో కలిసి ఈ ఎత్తులు వేసిందన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పొలిటికల్ అడ్వర్టైజ్ మెంట్లకు కూడా ఫేస్ బుక్ తెరలేపి క్యాష్ చేసుకుంటోంది. అయితే ఒక్కపార్టీకే పక్షపాతం చూపుతోందన్న విమర్శలున్నాయి.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..