‘మోదీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌’

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వార్దాలో చేసిన ప్రసంగంలో కోడ్‌ ఉల్లంఘనలు లేవంటూ ఎన్నికల సంఘం(ఈసీ) చెప్పడంపై కాంగ్రెస్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీంతో ఈసీ ఎన్నికల నియమావళిని ‘మోదీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌’గా మార్చినట్లు స్పష్టమైందని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ట్విటర్‌ వేదికగా స్పందించారు.‘‘ఆర్టికల్‌ 324తో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ప్రధానికి ఎటువంటి శిక్ష పడకపోవడం నిరాశకు గురి […]

'మోదీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌’
Follow us

| Edited By:

Updated on: May 01, 2019 | 8:05 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వార్దాలో చేసిన ప్రసంగంలో కోడ్‌ ఉల్లంఘనలు లేవంటూ ఎన్నికల సంఘం(ఈసీ) చెప్పడంపై కాంగ్రెస్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీంతో ఈసీ ఎన్నికల నియమావళిని ‘మోదీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌’గా మార్చినట్లు స్పష్టమైందని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ట్విటర్‌ వేదికగా స్పందించారు.‘‘ఆర్టికల్‌ 324తో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ప్రధానికి ఎటువంటి శిక్ష పడకపోవడం నిరాశకు గురి చేసింది. మోదీకి ఓ న్యాయం.. ఇతరులకు మరో న్యాయం ఉండడం సరికాదు’’ అని రణ్‌దీప్‌ వ్యాఖ్యానించారు.

కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పోటీ చేయడంపై మోదీ విమర్శలు గుప్పించారు. హిందువులను అవమానించిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. అందుకే, మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాన్ని రాహుల్‌ ఎంచుకున్నారని మోదీ ఎద్దేవా చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌… మోదీ వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయని ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.