కౌంటింగ్ కి కౌంట్ డౌన్..అభ్యర్థుల్లో టెన్షన్

17 వ లోక్ సభకు ఓటింగ్ ఆదివారంతో పూర్తయింది. ఏప్రిల్ 11 న మొదలైన ఏడు దశల పోలింగ్ ప్రక్రియ ఆ రోజుతో ముగిసింది. ఇక అభ్యర్థుల్లో టెన్షన్ మొదలు.. ఈ నెల 23  గురువారం ఓట్ల లెక్కింపుతో ఇది మరింత ‘ హీటెక్క’ నుంది. ఈ నేపథ్యంలో 2014 నాటి ఎన్నికలను ఈ తాజా ఎన్నికల సరళిని ఒక్కసారి పోల్చుకుంటే..  దేశ ఓటర్లలో ‘ చైతన్యం ‘ తగ్గిన విషయం స్పష్టమవుతోంది. ఈ సారి ఏడు […]

కౌంటింగ్ కి కౌంట్ డౌన్..అభ్యర్థుల్లో టెన్షన్
Follow us

|

Updated on: May 20, 2019 | 3:23 PM

17 వ లోక్ సభకు ఓటింగ్ ఆదివారంతో పూర్తయింది. ఏప్రిల్ 11 న మొదలైన ఏడు దశల పోలింగ్ ప్రక్రియ ఆ రోజుతో ముగిసింది. ఇక అభ్యర్థుల్లో టెన్షన్ మొదలు.. ఈ నెల 23  గురువారం ఓట్ల లెక్కింపుతో ఇది మరింత ‘ హీటెక్క’ నుంది. ఈ నేపథ్యంలో 2014 నాటి ఎన్నికలను ఈ తాజా ఎన్నికల సరళిని ఒక్కసారి పోల్చుకుంటే..  దేశ ఓటర్లలో ‘ చైతన్యం ‘ తగ్గిన విషయం స్పష్టమవుతోంది. ఈ సారి ఏడు దశల ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్ల శాతం 63.98 శాతంగా నమోదైంది. ముఖ్యంగా లోక్ సభ ఎలక్షన్స్ లో ప్రతి దశలోనూ ఓటర్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇది దాదాపు 2014 ఎన్నికల సరళిని ప్రతిబింబించింది. నాటి ఎన్నికల్లో మొదటి రెండు దశల పోలింగ్ అనంతరం ఓటర్ల శాతం
68-70 కాగా-ఆ తరువాత తదుపరి దశల్లో ఇది 66.40 శాతానికి తగ్గింది. ఇక ఏపీ, తమిళనాడు, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ అయిదేళ్ళలో పురుష ఓటర్ల సంఖ్య సుమారు 2 శాతం పెరగగా..మహిళా ఓటర్ల సంఖ్య కేవలం 1.13 శాతం పెరిగింది. 2014 నాటి ఎన్నికల్లో పాల్గొన్న పలువురు ప్రముఖ రాజకీయ నేతలు ఈ సారి ఎలక్షన్స్ కి దూరంగా ఉన్నారు. ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి వారు వృద్దాప్యం కారణంగా ఎన్నికల్లో పాల్గొనకపోగా, అనారోగ్యం వల్ల కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాయ్ బరేలీ నుంచి బరిలో దిగినప్పటికీ.. ఆమె తరఫున ప్రచారాన్ని కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంక గాంధీ నిర్వహించారు. ప్రధాని మోదీ 2014 ఎన్నికల్లో 437 ర్యాలీలు నిర్వహించగా,, ఈ ఎన్నికల్లో 144 ర్యాలీల్లో మాత్రమే పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విషయానికి వస్తే.. నాడు ఆయన 125 ర్యాలీలు నిర్వహిస్తే ఈ సారి 46 ర్యాలీలకే పరిమితమయ్యారు. గతంలో ప్రియాంక గాంధీ పెద్దగా ప్రచార ‘ యాత్రలు ‘ నిర్వహించకపోగా..ఈసారి మాత్రం ఏకంగా యూపీ తూర్పు ఇన్-చార్జ్ బాధ్యతలతో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం విశేషం. ఏమైనా..దేశ జనాభా పెరుగుతున్నప్పటికీ,,ఓటర్ల సంఖ్య మాత్రం  అందుకు తగినట్టు లేకపోవడమే విడ్డూరం. ఇందుకు కారణం..అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు తమ సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నాయని, అవినీతి కుంభకోణాల్లో మగ్గుతున్నాయని, స్థూల దేశీయోత్పత్తి వృద్ధిపై సరిగా ఫోకస్ పెట్టలేకపోతున్నాయని,, ఇచ్చిన హామీలను అమలు పరచడంలో వైఫల్యం చెందుతున్నాయని.. ఇంకా ఇలాంటి మరిన్ని  కారణాలతోనే ప్రజలు ఎన్నికలపట్ల ఉదాసీనంగా ఉంటున్నారన్నది వాస్తవం.