హుజూర్‌నగర్‌ బై పోల్: తమ మెజార్టీ ముందే చెప్పేసిన ఉత్తమ్

హుజూర్‌నగర్‌ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో 30వేల మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. హుజూర్‌ నగర్‌ స్థానానికి సంబంధించి పోలింగ్‌ తేదీని ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. జానారెడ్డి నేతృత్వంలో ఎన్నికల ప్రచారం చేస్తామని వివరించారు. ఈ ఎన్నిక అధికార అహంకారానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన […]

హుజూర్‌నగర్‌ బై పోల్: తమ మెజార్టీ ముందే చెప్పేసిన ఉత్తమ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 21, 2019 | 5:55 PM

హుజూర్‌నగర్‌ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో 30వేల మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. హుజూర్‌ నగర్‌ స్థానానికి సంబంధించి పోలింగ్‌ తేదీని ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. జానారెడ్డి నేతృత్వంలో ఎన్నికల ప్రచారం చేస్తామని వివరించారు. ఈ ఎన్నిక అధికార అహంకారానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఇంతవరకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.

కాగా, కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 23న హుజూర్ నగర్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 21న జరిగే ఉపఎన్నిక కోసం సెప్టెంబర్ 30తో నామినేషన్ల గడువు ముగియనుంది. అక్టోబర్ 3వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అక్టోబర్ 21న ఎన్నికలు నిర్వహించి 24న ఫలితాలు వెల్లడిస్తారు. ఇక టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా సైదిరెడ్డిని ప్రకటించింది. అటు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విషయంలో గందరగోళం కొనసాగుతోంది. ఉత్తమ్‌ సతీమణిని అభ్యర్థిగా ప్రకటించడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..