బ్రేకింగ్: హుజూర్‌నగర్‌ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు

బ్రేకింగ్: హుజూర్‌నగర్‌ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు

రెండు రాష్ట్రాలతో సాధారణ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మళ్లీ ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా తెలంగాణలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంకు కూడా అక్టోబర్ 21న ఉపఎన్నిక జరగనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ స్థానం 2018లో కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి పై స్వల్ప మెజార్టీతో గెలిచారు. కాగా తాజా […]

Ram Naramaneni

| Edited By: Rajesh Sharma

Sep 21, 2019 | 5:07 PM

రెండు రాష్ట్రాలతో సాధారణ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మళ్లీ ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా తెలంగాణలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంకు కూడా అక్టోబర్ 21న ఉపఎన్నిక జరగనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ స్థానం 2018లో కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి పై స్వల్ప మెజార్టీతో గెలిచారు. కాగా తాజా ఉపఎన్నికలో భాగంగా  ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ తన భార్య పద్మావతి పేరును ప్రకటించారు.

తాజాగా టిఆర్ఎస్ కూడా అభ్యర్థి పేరు ఖరారు చేసింది అధిష్టానం. గతంలో ఉత్తమ్‌పై పోటీ చేసి ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డి పేరును సీఎం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఖరారు చేశారు.  హుజూర్ నగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి, ఇతర ముఖ్య నాయకులతో కేసీఆర్ శనివారం మాట్లాడారు. తిరిగి సైదిరెడ్డినే అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించారు.

హుజూర్‌నగర్ నల్గొండ జిల్లాలో ఎంతో ప్రాముఖ్యతమైన నియోజకవర్గం. ముఖ్యంగా గతంలో ఇది కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. ఇక 2018 ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి 92,996 ఓట్లు వచ్చాయి . టీఆర్ఎస్ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డికి 85530 ఓట్లు పోలయ్యాయి. దీంతో 7,466 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి సైదిరెడ్డిపై గెలుపొందారు. హుజూర్‌నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి భార్య పద్మావతిని ప్రకటించినప్పటికి… ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. అభ్యర్థి  విషయంలో ఆ పార్టీ నేతల మధ్యే విభేదాలు తలెత్తుతున్నాయి. మరి ఉత్తమ్ ఇలాఖాలో టీఆర్‌ఎస్ పాగా వేస్తుందో..? లేదో? చూడాలి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu