పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణిల దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. సీఎం కేసీఆర్ జన్మదినం నాడే జరిగిన ఈ మారణకాండ తెలంగాణలో భయాందోళనలను రేకెత్తించాయి. పట్టపగలు, నడిరోడ్డుమీద అందరూ చేస్తుండగానే ఇద్దరు న్యాయవాదులను కత్తులతో నరకడం రాజకీయ దుమారం రేపుతుంది.
న్యాయవాద దంపతులను హత్యలు చేసినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి టీఆర్ఎస్ పార్టీతో సంబంధాలు ఉండటంతో అందరి వేళ్లు అధికార పార్టీ వైపే చూపెడుతున్నాయి. ఇదే సమయంలో విపక్షాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
తెలంగాణలో రాయలసీమ తరహా ఫ్యాక్షన్ సంస్కృతి వస్తోందని వీహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అన్నింట్లోనే కాదు.. హత్యల్లో కూడా తొలి స్థానంలో ఉందని అన్నారు. అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు వామనరావు దంపతులను హత్య చేశారని చెప్పారు. నడిరోడ్డు మీద ప్రాణాలు తీస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అని నిలదీశారు. నయీమ్ కేసు మాదిరిగానే ఈ కేసును కూడా నీరుగారుస్తారనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
Read more:
గుత్తికోయలపై అధికారుల ఆటివిక దాడి.. గిరిజనుల గుడిసెలు పీకి.. నిప్పంటించిన అటవీ అధికారులు