AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona warriors: ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కాళ్లు పట్టుకున్న కొవిడ్ వారియర్స్.. ఎందుకంటే..

Corona warriors: కరోనా మహమ్మారి ప్రజలను ఏ రేంజ్‌లో భయ బ్రాంతులకు గురిచేసిందో అందరికీ తెలిసిందే. కనీసం చిన్నపాటి..

Corona warriors: ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కాళ్లు పట్టుకున్న కొవిడ్ వారియర్స్.. ఎందుకంటే..
Shiva Prajapati
|

Updated on: Feb 19, 2021 | 6:48 PM

Share

Corona warriors: కరోనా మహమ్మారి ప్రజలను ఏ రేంజ్‌లో భయ బ్రాంతులకు గురిచేసిందో అందరికీ తెలిసిందే. కనీసం చిన్నపాటి దగ్గు దగ్గినా, తుమ్మినా సదరు వ్యక్తి నుంచి కిలోమీటరు దూరం పారిపోయిన పరిస్థితి ఉండేది. అయితే, కరోనా వారియర్స్ మాత్రం ఏమాత్రం భయపడలేదు. ప్రజలకు తాము ఉన్నామంటూ ముందుకు వచ్చారు. వైద్యాధికారులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా ఎంతో మంది కోవిడ్ సమయంలో తమ సేవలందించారు. అయితే, ఏపీలో కోవిడ్ సమయంలో ఆస్పత్రుల్లో సేవలందించిన పలువురిని ప్రభుత్వ విధుల నుంచి తొలగించారు అధికారులు. దాంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేదికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాగా.. ఆయనను కలిసేందుకు కోవిడ్ వారియర్స్ ప్రయత్నించారు. తమ బాధలను చెప్పుకోవాలని చూశారు. అయితే భద్రతా కారణాల రిత్యా సీఎంను కలవడం వారికి కురదలేదు. దాంతో వారు స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను ఆశ్రయించారు. తమ గోడును వెల్లబోసుకున్నారు. కోవిడ్ సమయంలో ఆస్పత్రుల్లో సేవలందించిన తమను ప్రభుత్వ విధుల నుంచి తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా ఓ వ్యక్తి.. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కాళ్లు పట్టుకుని తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిరంచాడు. వారి సమస్యలు విన్న ఎమ్మెల్యే రాపాక.. కోవిడ్ వారియర్స్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

Also read:

తెలంగాణలో రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతి.. నయీమ్ కేసు మాదిరే ఈ కేసును కూడా నీరుగారుస్తారన్న వీహెచ్‌

గుంటూరు జిల్లా గురజాల కోర్టు సంచలన తీర్పు.. దంపతుల హత్య కేసులో 14 మందికి యావజ్జీవ కారాగార శిక్ష