AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GMC polls: కౌన్‌ బనేగా గుంటూర్‌ మేయర్‌? పదేళ్ల తర్వాత జరుగుతున్న పోరుపై హైటెన్షన్

GMC polls: దాదాపు పదేళ్ల తర్వాత జరుగుతున్న గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను..

GMC polls: కౌన్‌ బనేగా గుంటూర్‌ మేయర్‌? పదేళ్ల తర్వాత జరుగుతున్న పోరుపై హైటెన్షన్
GMC polls
Sanjay Kasula
|

Updated on: Feb 19, 2021 | 7:41 PM

Share

GMC polls: దాదాపు పదేళ్ల తర్వాత జరుగుతున్న గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధిరాకపక్షం నుంచి కావటి మనోహర్‌ నాయుడు మేయర్‌ రేసులో ఉన్నారు. 2005లోనే ఆయన మేయర్‌ పదవికి పోటీపడ్డారు. అప్పట్లో రాయపాటి, కన్నా లక్ష్మీనారాయణ కుమారులు మేయర్‌ పదవి కోసం పోటీపడటంతో కావటి వెనక్కి తగ్గాల్సివచ్చింది.

అప్పటి నుంచి మేయర్‌ కావాలన్న ఆయన కోరిక అలాగే ఉండిపోయింది. తదనంతర కాలంలో వైసీపీ చేరారు కావటి! పదకూరపాడు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా పనిచేశారు. అయితే చివరి క్షణంలో పదకూరపాడు ఎమ్మెల్యే సీటు మరొకరికి కేటాయించడంతో మళ్లీ నిరాశ చెందారు.

తాజాగా గుంటూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ఆయనకు కలిసి వచ్చాయి. మంత్రి బొత్స శిష్యరికంలో మేయర్‌ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కావటి మనోహర్‌ నాయుడు. స్థానిక 20వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీచేస్తూ..మేయర్‌ పీఠం కోసం పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి ఏం ఆదేశించినా పార్టీ కార్యకర్తగా శిరసావహిస్తానంటున్నారు కావటి.

మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మేయర్‌ పీఠాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గుంటూరులో అన్ని డివిజన్లలో గట్టి పోటీ ఇస్తోంది. సుదీర్ఘకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కోవెలమూడి రవీంద్రను తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న రవీంద్ర..మేయర్‌ పదవికి పోటీపడుతున్నారు.

అటు గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ రేసులో జనసేన-బీజేపీ కూడమి కూడా ఉంది. వైసీపీ, టీడీపీలను పక్కకుపెట్టి..జనం తమ కూటమికే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు. ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మేయర్‌ పదవిని దక్కించుకోవడానికి తీవ్రమైన పోటీ నెలకొంది. మరి గుంటూరు కార్పొరేషన్‌పై ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి :

CA Exam Date 2021: సీఏ పరీక్ష రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల తేదీలు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. Bitcoin value jumps: ఎక్కడికీ ఈ పరుగు.. రోజు రోజుకు బిట్ కాయిన్ సరికొత్త కొత్త రికార్డులు..