YCP vs TDP: బుద్దా వర్సెస్ జోగి.. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి దగ్గర హైటెన్షన్..
ఒకవైపు బుద్ధా వెంకన్న. మరో వైపు జోగి రమేష్. వారిద్దరి తోపులాటతో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చంద్రబాబు ఇంటి దగ్గర...

ఒకవైపు బుద్ధా వెంకన్న. మరో వైపు జోగి రమేష్. వారిద్దరి తోపులాటతో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చంద్రబాబు ఇంటి దగ్గర నిరసనకు దిగారు వైసీపీ నేతలు. ఎమ్మెల్యే జోగి రమేష్ అక్కడకు వెళ్లారు. అప్పటికే అక్కడికి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చేరుకున్నారు. జోగి రమేష్ వెళ్లే సరికి బుద్ధా వెంకన్న వారిని అడ్డుకున్నారు.
ఇరు వైపుల పెద్దయెత్తున కార్యకర్తలు అక్కడి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కరకట్టపై ఉన్న పోలీస్ చెక్‌పోస్ట్ దగ్గరే వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు బుద్ధా వెంకన్న అనుచరులు. ఆ సమయంలో పోలీసులు వచ్చి అదుపు చేసినా ఎవరూ వినలేదు.
జెండా కర్రలతోనూ వైసీపీ, టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. కొందరి షర్ట్‌లు చిరిగిపోయాయి. బుద్ధా వెంకన్న, జోగి రమేష్ ఇద్దరూ చేతులు పట్టుకుని తోసుకున్నారు. చంద్రబాబు ఇంటి వైపు వెళ్లేందుకు జోగి రమేష్ తీవ్రంగా ప్రయత్నించారు. ఆయన్ను బుద్ధా వెంకన్న అడ్డుకున్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఇవి కూడా చదవండి: Governor Tamilisai: విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.. సంచలన ట్వీట్ చేసిన గవర్నర్ తమిళసై..
