జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్.. ఎంపీగా అక్కడి నుంచే పోటీనట..!

తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీకి ధీటుగా.. ఫెడరల్ ఫ్రంట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న స్పెషల్ ఫోకస్ చూస్తుంటే.. అవన్నీ నిజమేనేమో అనిపిస్తోంది. ఆయన ఏం చేసినా.. దాని వెనుకల ఓ పెద్ద రీజన్ ఉంటుంది. తాజాగా ఆయనకు ఇష్టమైన.. ఎంతగానో కలిసొచ్చిన కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీని వెనకాల ఎదో పెద్ద కారణమే ఉండొచ్చన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సమీక్ష సహా.. ఇతర […]

జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్.. ఎంపీగా అక్కడి నుంచే పోటీనట..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 19, 2020 | 5:08 AM

తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీకి ధీటుగా.. ఫెడరల్ ఫ్రంట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న స్పెషల్ ఫోకస్ చూస్తుంటే.. అవన్నీ నిజమేనేమో అనిపిస్తోంది. ఆయన ఏం చేసినా.. దాని వెనుకల ఓ పెద్ద రీజన్ ఉంటుంది. తాజాగా ఆయనకు ఇష్టమైన.. ఎంతగానో కలిసొచ్చిన కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీని వెనకాల ఎదో పెద్ద కారణమే ఉండొచ్చన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సమీక్ష సహా.. ఇతర అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు.. ఆయనే స్వయంగా జిల్లాలో పర్యటించారు. కరీంనగర్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే కేవలం నెలల వ్యవధిలోనే ఇలా కరీంనగర్‌పై ఇంత స్పెషల్ ఫోకస్ చేయడం వెనుక అసలు కారణంగా వేరేనని ప్రచారం జోరందుకుంది.

ఇక త్వరలోనే తన సీఎం పదవిని.. కేటీఆర్‌కు అప్పగించబోతున్నట్లు వార్తలు ఊపందుకుంటున్నాయి. ఆ తర్వాత జాతీయ రాజకీయాలపై ప్రత్యేకంగా సమయం కేటాయించి.. ఫెడరల్ ఫ్రంట్ భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకునేందుకు ప్రయత్నిస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం కేసీఆరే స్వయంగా ఓ సారి అన్నారు కూడా. జాతీయ రాజకీయాల్లో చక్రం తప్పాలని భావిస్తే.. తాను ఎంపీగా పోటీ చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్.. కరీంనగర్ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే పక్కా స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా బరిలోకి దిగేందుకు.. తనకు ఎంతగానో కలిసొచ్చిన కరీంనగర్‌ను ఎంపిక చేసుకున్నారని.. రాబోయే ఎన్నికల నాటికి కరీంనగర్‌లో టీఆర్ఎస్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇక గత ఎన్నికల్లో కరీంనగర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసి.. భారీ మెజార్టీతో గెలుచుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే.. అటు కరీంనగర్‌లో బీజేపీకి చెక్ పెట్టినట్లు అవుతుంది. అదేసమయంలో ఉత్తర తెలంగాణవ్యాప్తంగా కూడా బీజేపీకి ఎదురుదెబ్బ కొట్టొచ్చన్న అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌పై స్పెషల్ ఫోకస్ చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.