చచ్చిన పామును చంపడం భావ్యం కాదు

ప్రధానమంత్రికి మోడీకి మనం గౌరవం ఇవ్వలేదని వైసీపీ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. దేశం మొత్తం పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేక పోరాటం చేస్తుంటే ప్రధాన మంత్రికి గౌరవం ఇవ్వడంలేదని వైసీపీ నేతలు అనడం విడ్డూరంగా ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాడుతుంటే మద్దతు తెలపకపోవడమే కాకుండా ఇలా విమర్శించడం ఒక్క వైసీపీకే చెల్లుతుందని అన్నారు సీఎం. దీని బట్టి వైసీపీ, బీజేపీల మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో బయటపడిందని సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ […]

చచ్చిన పామును చంపడం భావ్యం కాదు
ప్రధానమంత్రికి మోడీకి మనం గౌరవం ఇవ్వలేదని వైసీపీ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. దేశం మొత్తం పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేక పోరాటం చేస్తుంటే ప్రధాన మంత్రికి గౌరవం ఇవ్వడంలేదని వైసీపీ నేతలు అనడం విడ్డూరంగా ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాడుతుంటే మద్దతు తెలపకపోవడమే కాకుండా ఇలా విమర్శించడం ఒక్క వైసీపీకే చెల్లుతుందని అన్నారు సీఎం. దీని బట్టి వైసీపీ, బీజేపీల మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో బయటపడిందని సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు.
ఏపీకి జరిగిన మోసాన్ని దేశమంతా గుర్తించినా.. మీరు గుర్తించలేకపోతున్నారని మండిపడ్డారు. బీజేపీని దీక్ష ద్వారా ఎండగట్టడంలో సఫలమయ్యామన్నారు చంద్రబాబు. ఇక్కడితో ఆపకుండా నేరుగా ప్రజల్లోకి వెళ్లి పోరాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తును జగన్ తాకట్టు పెడుతున్నారని, ఇందుకు ప్రజలే జగన్ కు వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెప్తారన్నారు. అయినా చచ్చిన పామును ఇంకా చండపడం భావ్యం కాదని బీజేపీని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఏపీకి చేయాల్సిన న్యాయం చేయాలని.. ఇప్పటికికూడా బీజేపీ స్పందిచకపోతే వాళ్లకే నష్టమని అన్నారు.

Published On - 12:45 pm, Tue, 12 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu