AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోడీ, కేసీఆర్, జగన్‌పై విరుచుకుపడ్డ చంద్రబాబు

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మోడీ, కేసీఆర్, జగన్‌లపై విరుచుకుపడ్డారు. మోడీ, కేసీఆర్‌లతో కలిసి జగన్ ఏపీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ను బానిసగా చేసుకుని మోడీ, కేసీఆర్‌లు అరాచకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నేరాలను తప్పించుకోవడానికి జగన్‌కు మోడీ, కేసీఆర్‌లు దొరికారని అన్నారు. చివరికి డేటాను సైతం దొంగిలించే స్థాయికి దిగజారారని, ఎవరికీ రాని ఆలోచనలు జగన్‌కు వస్తాయని అన్నారు. నేరాల్లో జగన్ గ్రాండ్ […]

మోడీ, కేసీఆర్, జగన్‌పై విరుచుకుపడ్డ చంద్రబాబు
Vijay K
|

Updated on: Mar 13, 2019 | 6:19 PM

Share

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మోడీ, కేసీఆర్, జగన్‌లపై విరుచుకుపడ్డారు. మోడీ, కేసీఆర్‌లతో కలిసి జగన్ ఏపీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ను బానిసగా చేసుకుని మోడీ, కేసీఆర్‌లు అరాచకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నేరాలను తప్పించుకోవడానికి జగన్‌కు మోడీ, కేసీఆర్‌లు దొరికారని అన్నారు.

చివరికి డేటాను సైతం దొంగిలించే స్థాయికి దిగజారారని, ఎవరికీ రాని ఆలోచనలు జగన్‌కు వస్తాయని అన్నారు. నేరాల్లో జగన్ గ్రాండ్ మాస్టర్, చట్ట వ్యతిరేకంగా ఎన్ని నేరాలు ఉన్నాయో అన్నీ చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. నేరాలు చేసి ఎలా తప్పించుకోవాలో జగన్‌కు బాగా తెలుసు. ఫామ్-7 ఇచ్చి, లక్షలాది ఓట్లను తీసేయడం దారుణమని అన్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా 9 లక్షల ఓట్లు తొలగింపుకు దరఖాస్తులు ఇచ్చారని చెప్పారు.