టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరనున్న చలమలశెట్టి సునీల్
ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ నేత చలమలశెట్టి సునీల్ నేడు వైసీపీలో చేరనున్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో
Chalamalasetty Sunil join YSRCP: ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ నేత చలమలశెట్టి సునీల్ నేడు వైసీపీలో చేరనున్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సునీల్ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కాగా 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థిగా కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి తోట నర్సింహం చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన సునీల్, వైసీపీ ఎంపీ వంగా గీత చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత నుంచి టీడీపీకి దూరంగా ఉండగా, ఇప్పుడు తిరిగి సొంతగూటికి చేరుకోనున్నారు. కాగా 2022లో రాజ్యసభకు ఖాళీ అవుతున్న ఓ ఎంపీ స్థానంలో సునీల్‌కు అవకాశం కల్పించడానికి అధికార పార్టీతో ఇటీవల మంతనాలు జరిగినట్టు సమాచారం. అయితే ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు వైసీపీ కండువాలను కప్పుకున్న విషయం తెలిసిందే. మరికొందరు కూడా అధికార పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
Read This Story Also: చెన్నైలోని అమ్మోనియం నైట్రేట్ తెలంగాణకు తరలింపు