మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూత

మాజీ మంత్రి, వైసీపీ నేత పెనుమత్స సాంబశివరాజు మృతి చెందారు. గత కొన్ని రోజులుగా విశాఖలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూత
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 10, 2020 | 4:45 PM

Former Minister Sambasiva Raju: మాజీ మంత్రి, వైసీపీ నేత పెనుమత్స సాంబశివరాజు మృతి చెందారు. గత కొన్ని రోజులుగా విశాఖలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. కాగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సాంబశివరాజు, రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. షుగర్ ఇండస్ట్రీస్, రవాణా శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఇక పెనుమత్స సాంబశివరాజు మంత్రి బొత్సకు గురువు. అంతేకాదు గత ఎన్నికల్లో వైసీపీలో ఆయన క్రియాశీలకంగా వ్యవహారించారు. నామినేటెడ్ పదవి రేసులో పెనుమత్స పలుమార్లు జగన్‌ని కలిశారు. ఆయన మరణంపై వైసీపీ నేతలు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా నటుడు కృష్ణుడికి సాంబశివ రాజు తాత అవుతారు.

Read This Story Also: రామ మందిరానికి 2.1 టన్నుల భారీ గంట