AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హొలీ పండుగ వచ్చేసింది., ఇళ్లలోనే సెలబ్రేట్ చేసుకొండి, ఢిల్లీ వాసులకు సీఎం కేజ్రీవాల్ సూచన

హోలీ పండుగ వచ్చేసిందని, అయితే కరోనా వైరస్ కారణంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఈ సంబరాలు చేసుకునే బదులు వారంతా తమ ఇళ్లలోనే రంగుల పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు.

హొలీ పండుగ వచ్చేసింది., ఇళ్లలోనే సెలబ్రేట్ చేసుకొండి, ఢిల్లీ వాసులకు సీఎం కేజ్రీవాల్ సూచన
Celebrate Holi At Homes Says Delhi Cm Arvind Kejriwal
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Mar 28, 2021 | 4:14 PM

Share

హోలీ పండుగ వచ్చేసిందని, అయితే కరోనా వైరస్ కారణంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఈ సంబరాలు చేసుకునే బదులు వారంతా తమ ఇళ్లలోనే రంగుల పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు.  నగరంలో  పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల కారణంగా తాను ఏ ప్రజాసంబంధహోలీ కార్యక్రమాల్లోనూ పాల్గొనబోనని, గుంపులుగా కాకుండా తమ కుటుంబాలతో ప్రజలు తమ ఇళ్లలోనే వీటిని నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం ఒక్క రోజే ఢిల్లీలో 1558 కేసులు కొత్తగా నమోదయ్యాయి. (గత డిసెంబరు15 న1617 కేసులు నమోదైన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు).   కరోనా నివారణకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని కేజ్రీవాల్ కోరారు. హోలీ, నవరాత్రి వంటి పండుగల సందర్భంగా నగరంలో ప్రజా సంబంధ సెలబ్రేషన్స్ ఉండబోవని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను, మార్గదర్శక సూత్రాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ కూడా ఓ ప్రకటనలో కోరింది.

జిల్లా వారీ టీమ్ లను జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసులు ఏర్పాటు చేశారని, ప్రభుత్వ ఆదేశాలను పాటించనివారి పట్ల ఈ బృందాలు   కఠిన చర్యలు తీసుకుంటాయని  ఈ సంస్థ హెచ్చరించింది. అలాగే నగర పోలీసులు కూడా ఓ అడ్వైజరీ ఆర్డర్ జారీ చేస్తూ…. ప్రజలు బయటకి గుంపులుగా వచ్చి హొలీ ఆడిన పక్షంలో లీగల్ గా కూడా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గ్రౌండ్లు, పార్కులు తదితర బహిరంగ ప్రదేశాల్లో హోలీ ఆడకూడదన్నారు .  ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించేలా చూడాలని  చీఫ్  సెక్రటరీ విజయ్ దేవ్ అధికారులను ఆదేశించారు.  అటు- ప్రొటొకాల్స్ ను ఉల్లంఘించేవారిపై కేసులు  పెట్టే యోచన ఉందని ఆరోగ్య శాఖ మంత్రి  సత్యేంద్ర జైన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  ఇది కేవలం హోలీకే కాక ఇతర పండుగలకు కూడా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి:Holi 2021: హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా ? రంగుల వేడుక ప్రాముఖ్యత.. పురాణాల ప్రకారం..

AP Crime News: మహిళల పొదుపు నిధులను మింగేశారు.. ఏకంగా కోటి 75లక్షలు కాజేశారు…!

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!