- Telugu News Photo Gallery Spiritual photos Holi 2021 significance of holi festival and why is it celebrated in india
Holi 2021: హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా ? రంగుల వేడుక ప్రాముఖ్యత.. పురాణాల ప్రకారం..
Holi 2021 Festival:హోలీ అంటేనే రంగుల పండుగ. చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా.. జీవితంలోని సమస్యలను మరచి ఆనందంగా రంగులు జల్లుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. నూతన ప్రకృతికి స్వాగతం పలుకుతూ.. ఫాల్గుణ పూర్ణిమ నాడు హోలిని జరుపుకోవడానికి గల రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Mar 28, 2021 | 4:05 PM

సతీ దేవిని కోల్పోయిన శివుడు ఒక గుహలో తప్పస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ తప్పస్సు నుంచి శివుడిని మేల్కోల్పడానికి పార్వతి దేవి రాగా.. ఆమెకు సహయంగా వచ్చిన మన్మథుడు.. పరమేశ్వరుడిపైకి మన్మథ బాణాన్ని విసురుతాడు.

దాంతో వెంటనే తప్పస్సు నుంచి బయటకు వచ్చిన శివుడు తన మూడో కన్ను తెరచి.. మన్మథుడిని భష్మం చేస్తాడు. ఆ కామదహనమే.. హోలీ జరుపుకోవడానికి కారణమంటుంటారు.

భక్త ప్రహ్లాదుడిని చంపాడానికి హిరణ్యకశిపుడు హోలికా అనే రాక్షసిని నియమిస్తాడు. అయితే ప్రహ్లదుడిని చంపాలనుకున్న హోలికా తనే అగ్నికి దహనమవుతుంది.

ఆ తర్వాత విష్ణు మూర్తి నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని చంపుతాడు. మిక్కిలి ఆవేశంలో ఉన్న విష్ణువును శాంతింపజేయడానికి శివుడు వచ్చాడని.. దీంతో హోలీ జరుపుకుంటారని చెప్పుకుంటారు.

హోలికాను దహనం చేయడం వలన చెడుపై మంచి విజయం గెలిచిందని.. హోలిక దహనం సమయంలో ప్రజలు అగ్ని చుట్టూ చేరి.. మతపరమైన కర్మలు చేసారని అంటుంటారు.

శాస్త్రాల ప్రకారం.. వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులను నివారించడానికి కొన్ని ఔషద మొక్కల నుంచి తయారు చేసిన సహజ రంగులు కలిపిన నీళ్ళను జల్లుకుంటారని చెబుతుంటారు.

కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, .మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు. దీనిని జల్లుకోవడం వలన వ్యాధులు తొలగిపోతాయని నమ్ముతుంటారు.




