రాజధాని నిర్మాణంలో భారీ అవినీతి.. బొత్స లెక్కలు వింటే బేజారే !

అమరావతి పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. రాజధాని నిర్మాణం పేరిట.. సొంత వ్యక్తులకు ప్రయోజనాల కోసం..సొంత ఇమేజీని పెంచుకు క్రమంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు చిన్నాభిన్నం చేశారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారానికి తెరలేపాయి. గత అయిదేళ్ళలో రాజధాని నిర్మాణం పేరిట అక్షరాలా 30 వేల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని పీటర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రెండున్నర లక్షల మేరకు ఆదాయాన్ని పెంచానంటున్న […]

రాజధాని నిర్మాణంలో భారీ అవినీతి.. బొత్స లెక్కలు వింటే బేజారే !
Follow us

|

Updated on: Oct 23, 2019 | 6:09 PM

అమరావతి పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. రాజధాని నిర్మాణం పేరిట.. సొంత వ్యక్తులకు ప్రయోజనాల కోసం..సొంత ఇమేజీని పెంచుకు క్రమంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు చిన్నాభిన్నం చేశారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారానికి తెరలేపాయి. గత అయిదేళ్ళలో రాజధాని నిర్మాణం పేరిట అక్షరాలా 30 వేల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని పీటర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రెండున్నర లక్షల మేరకు ఆదాయాన్ని పెంచానంటున్న చంద్రబాబు అదెక్కడ్నించి వచ్చిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు బొత్స.

రాజధాని ప్రాంతంలో జరిగిన ప్రతీ ప్రాజెక్టులో, ప్రతీ నిర్మాణంలో నిధులు దుర్వినియోగం అయ్యాయని, ప్రతీ పనిని పున: సమీక్షించాల్సిన అవసరం కనిపిస్తోందని బొత్స సత్యనారాయణ అన్నారు. కోర్ క్యాపిటల్ ఏరియాలో జరిగిన నిర్మాణాలు నిబంధనలకు విరుద్దంగా జరిగాయని మంత్రి తెలిపారు. అయితే ఇప్పటికే 75 శాతం పూర్తి అయిన నిర్మాణాల విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెబుతున్నారు. పీటర్ కమిటీ కూడా ఈ విషయాన్ని ప్రభుత్వానికి వదిలేసిందని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన చంద్రబాబు తన సొంత వ్యక్తుల, వియ్యంకుల వియ్యంకులకు ప్రయోజనం చేసేందుకు భారీ ఎత్తున నిధులు కేటాయించారని బొత్స ఆరోపించారు.

గత కొంతకాలంగా ఏపీ రాజధానిపై రగడ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా బొత్స చేసిన కామెంట్లు.. విసిరిన ఆరోపణలు రాజకీయ రచ్చకు తెరలేపాయి. రాజధాని తరలిస్తారన్న ఊహాగానాలకు తాజా వ్యాఖ్యలు తోడవడంతో ఈ చర్చ మరింత వేడెక్కినట్లయ్యింది. పున: సమీక్షల పేరిట అయిదేళ్ళ కాలయాపన చేస్తే పదేళ్లయినా రాష్ట్రానికి రాజధాని లేకుండా పోతుందని పలువురు వాపోతున్నారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!