ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి అగ్నిపరీక్ష

యూపీ, బీహార్ రాష్ట్రాల్లో త్వరలో నిర్వహించబోయే లోక్‌సభ ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్షగా పరిణమించాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మొత్తం 120 సీట్లు ఉన్నాయి. అభ్యర్థుల్లో తీవ్ర పొటీ నెలకొంది. ఈ క్రమంలో అటు ప్రధాని మోదీ, ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ రాష్ట్రాల్లోని ప్రతీ లోక్‌సభ స్థానంపై ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రత్యర్థులను బలంగా ఢీకొనే నాయకులను ఎంపిక చేస్తున్నారు. ముందుగా బీహార్‌కు చెందిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ఎంపిక […]

ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి అగ్నిపరీక్ష
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 18, 2019 | 5:52 PM

యూపీ, బీహార్ రాష్ట్రాల్లో త్వరలో నిర్వహించబోయే లోక్‌సభ ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్షగా పరిణమించాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మొత్తం 120 సీట్లు ఉన్నాయి. అభ్యర్థుల్లో తీవ్ర పొటీ నెలకొంది. ఈ క్రమంలో అటు ప్రధాని మోదీ, ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ రాష్ట్రాల్లోని ప్రతీ లోక్‌సభ స్థానంపై ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రత్యర్థులను బలంగా ఢీకొనే నాయకులను ఎంపిక చేస్తున్నారు.

ముందుగా బీహార్‌కు చెందిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ఎంపిక చేసి, పట్నా నుంచి బరిలోకి దించాలని బీజేపీ నిర్ణయించింది. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌ బేగుసరాయ్ నుంచి బీజేపీ తరపున పోటీ పడనున్నారు. ఇదేకోవలో మరో కేంద్రమంత్రి ఆర్‌కే సింగ్‌ను కూడా పోటీలో నిలపాలని పార్టీ భావించింది. అలాగే కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్, రాజీవ్ ప్రతాప్‌లకు బీజేపీ… లోక్‌సభ టిక్కెట్లు కేటాయించింది.

ఇక ఉత్తర‌ప్రదేశ్ విషయానికొస్తే అక్కడ అఖిలేష్, మాయావతిలతో బీజేపీకి గట్టిపోటీ ఎదురుకానుంది. దీంతో ఇక్కడి అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ బీజేపీ అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండ్యా ఇతర ముఖ్య నేతలతో అధిష్టానం సమావేశం కానుంది.