విజయం తెచ్చిన ఆనందం.. బీజేపీ ఎమ్మెల్యే డ్యాన్స్

కర్ణాటకలో మూడు వారాల పాటు కొనసాగుతున్న టెన్షన్‌కు మంగళవారంతో తెరపడింది. విశ్వాస పరీక్షలో నెగ్గలేకపోవడంతో హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో బీజేపీ నేతలు ఆనందంలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేణుకాచార్య తన అనుచరులతో కలిసి డ్యాన్స్ వేశారు. అయితే కర్ణాటక విధానసభలో విశ్వాస పరీక్ష జరిగే సమయంలో బెంగళూరులోని ఓ హోటల్‌లో బీజేపీ పార్టీ మీటింగ్‌ జరుగుతోంది. ఇక సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిందన్న వార్తలు రావడంతో […]

విజయం తెచ్చిన ఆనందం.. బీజేపీ ఎమ్మెల్యే డ్యాన్స్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 24, 2019 | 12:30 PM

కర్ణాటకలో మూడు వారాల పాటు కొనసాగుతున్న టెన్షన్‌కు మంగళవారంతో తెరపడింది. విశ్వాస పరీక్షలో నెగ్గలేకపోవడంతో హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో బీజేపీ నేతలు ఆనందంలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేణుకాచార్య తన అనుచరులతో కలిసి డ్యాన్స్ వేశారు.

అయితే కర్ణాటక విధానసభలో విశ్వాస పరీక్ష జరిగే సమయంలో బెంగళూరులోని ఓ హోటల్‌లో బీజేపీ పార్టీ మీటింగ్‌ జరుగుతోంది. ఇక సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిందన్న వార్తలు రావడంతో అక్కడున్న వారు హోటల్‌ బయట టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇక ఎమ్మెల్యే రేణుకాచార్య బయటకు వచ్చిన ఆయన ఆనందంతో డ్యాన్స్ వేశారు. అంతేకాదు అక్కడున్న తన అనుచరులు, కార్యకర్తలను కూడా డ్యాన్స్ వేయాలంటూ ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కాగా సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 16మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో దాదాపు మూడు వారాల పాటు కర్ణాటక రాజకీయాల్లో సీరియల్‌ను మించిన మలుపులు తిరిగాయి. ఇక మంగళవారం జరిగిన విశ్వాసపరీక్షలో కాంగ్రెస్‌-జేడీఎస్‌కు 99 ఓట్లు రాగా.. బీజేపీకి 105పడ్డాయి. దీంతో కుమార ప్రభుత్వం పడిపోయింది. ఇక కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

అయితే 1956లో కర్ణాటక ఏర్పడగా.. ఇప్పటి వరకు ముగ్గురు ముఖ్యమంత్రులు మాత్రమే తమ ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకున్నారు. వారిలో నిజలింగప్ప(1962-68), దేవరాజ్ అర్స్(1972-77), సిద్ధరామయ్య(2013-2018)లు ఉన్నారు.