వైసీపీలో ర్యాగింగ్
జూనియర్స్ సీనియర్స్ ని క్వశ్యన్ వేయద్దు… ఈ డైలాగ్ వినే ఉంటారు. సేమ్ డైలాగ్ ఇప్పుడు వైసీపీలో వినబడుతోంది. ఎమ్మెల్యే కన్నా మంత్రి ఎక్కువే కానీ వైసీపీలో మాత్రం సీనియర్ ఎమ్మెల్యేలు జూనియర్ మంత్రులను ర్యాగింగ్ చేస్తున్నారట. ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించింది. అయితే వీరిలో మెజార్టీ ఎమ్మెల్యేలు సీనియర్లే ఉన్నారు. కానీ ఈ సీనియర్ ఎమ్మెల్యేలు జూనియర్ మంత్రులను ర్యాగింగ్ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. అధికారుల బదిలీల దగ్గర నుంచి […]
జూనియర్స్ సీనియర్స్ ని క్వశ్యన్ వేయద్దు… ఈ డైలాగ్ వినే ఉంటారు. సేమ్ డైలాగ్ ఇప్పుడు వైసీపీలో వినబడుతోంది. ఎమ్మెల్యే కన్నా మంత్రి ఎక్కువే కానీ వైసీపీలో మాత్రం సీనియర్ ఎమ్మెల్యేలు జూనియర్ మంత్రులను ర్యాగింగ్ చేస్తున్నారట.
ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించింది. అయితే వీరిలో మెజార్టీ ఎమ్మెల్యేలు సీనియర్లే ఉన్నారు. కానీ ఈ సీనియర్ ఎమ్మెల్యేలు జూనియర్ మంత్రులను ర్యాగింగ్ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. అధికారుల బదిలీల దగ్గర నుంచి మీడియాతో మాట్లాడే వరకు సీనియర్ ఎమ్మెల్యేలు జూనియర్ మంత్రులకు చుక్కలు చూపిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు..సీనియర్ మంత్రులు కూడా జూనియర్ మంత్రులను డామినేట్ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే జూనియర్ మంత్రులు ఈ మేటర్ సీఎం వద్దకు తీసుకెళ్లారట. మరి వైసీపీలో జరుగుతున్న ర్యాగింగ్ కి జగన్ ఎలా చెక్ పెడతారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.