AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలిసొస్తున్న కమలం నేతలు.. తెలంగాణలో అధికారం కోసం బీజేపీ వ్యూహం మారిందా?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణపై అధిష్టానం ఫోకస్ చేసింది..అందులో భాగంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ నాయకుల అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి పటిష్టత, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది.

కలిసొస్తున్న కమలం నేతలు.. తెలంగాణలో అధికారం కోసం బీజేపీ వ్యూహం మారిందా?
Bjp Leaders Meet In Delhi
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Aug 07, 2026 | 1:11 PM

Share

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణపై అధిష్టానం ఫోకస్ చేసింది..అందులో భాగంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ నాయకుల అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి పటిష్టత, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో జాతీయ నేతలు సునీల్ బన్సాల్, అభయ్ పాటిల్ తోపాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు హాజరవుతున్నారు.

అధికారమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణ!

ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితులపై సమగ్ర సమీక్ష జరగనుంది. ఇటీవల కొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ విస్తరణపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జూన్ నెలలో నితిన్ నవీన్ తెలంగాణ పర్యటన తరువాత రాష్ట్ర నాయకత్వం చేపట్టిన కార్యక్రమాలు.. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడానికి అనుసరిస్తున్న వ్యూహాలు, ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, సంస్థాగత అంశాలు, క్షేత్ర స్థాయి నివేదికలపై సమీక్ష జరగనుంది. పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించి జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయనుంది. ఈ సమావేశం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ మరింత దూకుడు పెంచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

పార్టీలో మొదలైన ఐక్యత రాగం..!

తెలంగాణలో అధికారం సాధించాలంటే మొదట నేతల మధ్య ఐక్యత అవసరం. ఆ దిశగా ప్రస్తుత పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. వరుసగా కేంద్రమంత్రులను కలిసి తెలంగాణ అంశాలపై విజ్ఞాపనలు ఇవ్వడం.. పార్లమెంట్ ఆవరణలో గ్రూప్ ఫోటోలు దిగడం ,కలిసి పనిచేయడం మొదలైంది. కేంద్రమంత్రి బండి సంజయ్ – ఈటల రాజేందర్ మధ్య సమన్వయం వంటి పరిణామాలు జరిగాయి. బండి సంజయ్ బీజేపీ ఎంపీలతో వరుసగా విందు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న దిశగా మొదట పార్టీ ఐక్యంగా బలంగా ఉంటే ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవచ్చన్న పంథాలో బిజెపి నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణపై ఢిల్లీ ఫోకస్‌.. బీజేపీ నెక్స్ట్‌ గేమ్‌ప్లాన్‌ ఇదే!
తెలంగాణపై ఢిల్లీ ఫోకస్‌.. బీజేపీ నెక్స్ట్‌ గేమ్‌ప్లాన్‌ ఇదే!
పిల్లల కోసం ప్రాణాలకు తెగించిన తల్లి పిల్లి.. ఏం చేసిందో చూస్తే
పిల్లల కోసం ప్రాణాలకు తెగించిన తల్లి పిల్లి.. ఏం చేసిందో చూస్తే
ముగియనున్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు.. ఎప్పటి వరకు అంటే..!
ముగియనున్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు.. ఎప్పటి వరకు అంటే..!
స్కూల్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి!
స్కూల్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి!
ఈ 5 ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లడం కష్టమే.. ఎందుకో తెలుసా?
ఈ 5 ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లడం కష్టమే.. ఎందుకో తెలుసా?
వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. ఇదిగో వీడియో
వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. ఇదిగో వీడియో
గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కరెంట్ స్తంభం ఎక్కి యువకుడి హల్‌చల్! 
గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కరెంట్ స్తంభం ఎక్కి యువకుడి హల్‌చల్! 
రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..!
రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..!
వైభవ్ ఫ్రెండ్‌తోనూ పరేషానే.. నిప్పులు చెరిగే బౌలర్‌ భయ్యో..!
వైభవ్ ఫ్రెండ్‌తోనూ పరేషానే.. నిప్పులు చెరిగే బౌలర్‌ భయ్యో..!
ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్!
ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్!