AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తప్పు చేయలేదని నిరూపించుకుంటా… ఈఎస్ఐ స్కామ్‌పై అచ్చెన్నాయుడు..

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లకు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందంటూ ఇటీవల విజిలెన్స్ నివేదిక బయటకు వచ్చింది. దీంతో వైసీపీ అచ్చెన్నాయుడుపై మాటల యుద్ధానికి దిగింది. దీనిపై ఆదివారం అచ్చెన్నాయుడు స్పందించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో తన సోదరుడు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అచ్చెన్నాయుడు […]

తప్పు చేయలేదని నిరూపించుకుంటా... ఈఎస్ఐ స్కామ్‌పై అచ్చెన్నాయుడు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 24, 2020 | 6:53 AM

Share

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లకు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందంటూ ఇటీవల విజిలెన్స్ నివేదిక బయటకు వచ్చింది. దీంతో వైసీపీ అచ్చెన్నాయుడుపై మాటల యుద్ధానికి దిగింది. దీనిపై ఆదివారం అచ్చెన్నాయుడు స్పందించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో తన సోదరుడు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఎర్రనాయుడు వారసులుగా తప్పు చేసే పరిస్థితి మాకు లేదన్నారు. ఈఎస్ఐ స్కామ్‌లో తప్పు చేయలేదని నిరూపించుకుంటానన్న.. ఆయన.. మంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడా కూడా తప్పు చేయలేదని.. కావాలనే జగన్ సర్కార్ తనను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అప్పటి ఈఎస్ఐ ఒప్పందానికి సంబంధించిన ఫైల్స్.. ప్రభుత్వం దగ్గరే ఉన్నాయన్న అచ్చెన్నాయుడు.. ఒక్కసారి సరిచూసుకోండంటూ ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ఫైల్స్ చూడకుండా ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతూ మనోధైర్యాన్ని దెబ్బతీస్తే.. బయపడే వాడిని కాదన్నారు అచ్చెన్నాయుడు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని మండిపడ్డారు.

పాత బాటిళ్లను కొత్తవాటిలా.. స్టిక్కర్ జిగురు వదిలించే ట్రిక్
పాత బాటిళ్లను కొత్తవాటిలా.. స్టిక్కర్ జిగురు వదిలించే ట్రిక్
రొటీన్ సినిమానే కానీ.. ట్విస్ట్‌తో థ్రిల్‌ వస్తుంది
రొటీన్ సినిమానే కానీ.. ట్విస్ట్‌తో థ్రిల్‌ వస్తుంది
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. నోరూరించే గోంగూర, మటన్ బోటి
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. నోరూరించే గోంగూర, మటన్ బోటి
3 లక్షలకుపైగా స్కూటర్ల రీకాల్‌.. ఇందులో మీ స్కూటర్‌ కూడా ఉందా?
3 లక్షలకుపైగా స్కూటర్ల రీకాల్‌.. ఇందులో మీ స్కూటర్‌ కూడా ఉందా?
CPRతో పునర్ జన్మ.. ఎమర్జెన్సీ టైంలో ఫర్‌ఫెక్ట్‌గా ఎలా చేయాలంటే?
CPRతో పునర్ జన్మ.. ఎమర్జెన్సీ టైంలో ఫర్‌ఫెక్ట్‌గా ఎలా చేయాలంటే?
రథ సప్తమి రోజున తప్పక చేయాల్సినవి.. చేయకూడనవి తెలుసా?
రథ సప్తమి రోజున తప్పక చేయాల్సినవి.. చేయకూడనవి తెలుసా?
30 రోజులు ఈ ఆసనం వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యం ఫుల్ ఖుష్!
30 రోజులు ఈ ఆసనం వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యం ఫుల్ ఖుష్!
కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుండగా..!
కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుండగా..!
నైన్టీస్ కిడ్స్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ సీరియల్ సాంగ్.. ❤️
నైన్టీస్ కిడ్స్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ సీరియల్ సాంగ్.. ❤️
నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే..
నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే..