Perni Nani : నారా లోకేష్‌కు జూనియర్ ఎన్టీఆర్ భయం పట్టుకుంది : మంత్రి పేర్ని నాని

కర్నూలులో తమ పార్టీ నేతల హత్య సందర్భంలో కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్లి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడిన మాటలు వైసీపీ..

Perni Nani : నారా లోకేష్‌కు జూనియర్ ఎన్టీఆర్ భయం పట్టుకుంది : మంత్రి పేర్ని నాని
Perni Nani
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 21, 2021 | 8:39 PM

Perni Nani on Nara Lokesh : కర్నూలులో తమ పార్టీ నేతల హత్య సందర్భంలో కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్లి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడిన మాటలు వైసీపీ నేతలకు బాగా మంటపుట్టిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నారాలోకేష్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తే, తాజాగా మరో మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగారు. లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ భయం పట్టుకుందని నాని చెప్పుకొచ్చారు. మీడియా సమావేశంలో లోకేష్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన, లోకేష్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము కూడా తిట్టగలమని హెచ్చరించిన పేర్ని.. నారా లోకేష్ ఇప్పుడు సొంత పార్టీలోనే ఉనికి కోసం తాపత్రయపడుతున్నాడని విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్ రావాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటుండడమే అందుకు కారణమన్నారు. కార్యకర్తలు “రావాలి జూనియర్ ఎన్టీఆర్, కావాలి జూనియర్ ఎన్టీఆర్” అంటుండడంతో… “జూనియర్ ఎన్టీఆర్ అక్కర్లేదు నేనే సరిపోతాను” అంటూ జగన్ మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

అసభ్యంగా, విచక్షణ లేకుండా ఏరా, ఒరే అని లోకేష్ మాట్లాడుతున్నాడని, తాము కూడా మాట తూలగలం అని పేర్ని నాని అన్నారు. అయినా.. గడ్డం పెంచిన వాడల్లా గబ్బర్ సింగ్ కాలేడని లోకేష్ ను ఎద్దేవా చేశారు. లోకేష్ ఉద్యోగం పోయిన రాజకీయ నిరుద్యోగి అని వ్యంగ్యం ప్రదర్శించారు. లోకేశ్ ప్రస్తుతం తీవ్ర అసహనంలో ఉన్నారని, చూస్తుంటే సానుభూతి కలుగుతోందని వ్యాఖ్యానించారు. చివరికి అమ్మాయిలపై అఘాయిత్యం జరిగినా రాజకీయం చేస్తున్నారని నాని మండిపడ్డారు.

Nara Lokesh : కత్తితో బ్రతికేవాడు కత్తితోనే పోతాడాని మరోసారి గుర్తుచేస్తున్నా.. ! ఇదేనా మీ పారదర్శకత..? : లోకేష్

Read also : Vincent Raja car : తెల్లవారు జామున విన్సెంట్ రాజా కారు ఆయిల్ ట్యాంక్ అంటించిన దుండగులు.. ఏంజరిగిందో.. సీసీటీవీ విజువల్స్ లో..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో