అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం జగన్ సెన్సేషనల్ డెసిషన్..!!

అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఏపీ సీఎం జగన్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పటి వరకూ.. అగ్రిగోల్డ్ న్యాయం జరగని నేపథ్యంలో.. జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ఇచ్చిన హామీల అమలులో మరో ముందడుగు పడింది. అగ్రిగోల్డ్ బాధితులకు తొలి విడతగా చెల్లింపులు జరిపింది ఏపీ సర్కార్. 10 వేల లోపు ఉన్న డిపాజిటర్లకు మొదటి విడతగా చెక్కులు పంపిణీ చేశారు. దీంతో.. మూడు లక్షల 69వేల మందికి 263,99,00,983 […]

 • Tv9 Telugu
 • Publish Date - 12:40 pm, Thu, 7 November 19
అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం జగన్ సెన్సేషనల్ డెసిషన్..!!

అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఏపీ సీఎం జగన్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పటి వరకూ.. అగ్రిగోల్డ్ న్యాయం జరగని నేపథ్యంలో.. జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ఇచ్చిన హామీల అమలులో మరో ముందడుగు పడింది. అగ్రిగోల్డ్ బాధితులకు తొలి విడతగా చెల్లింపులు జరిపింది ఏపీ సర్కార్. 10 వేల లోపు ఉన్న డిపాజిటర్లకు మొదటి విడతగా చెక్కులు పంపిణీ చేశారు. దీంతో.. మూడు లక్షల 69వేల మందికి 263,99,00,983 కోట్ల రూపాయలు పంపిణీ చేయనుంది వైసీపీ ప్రభుత్వం. కాగా.. కేవలం గుంటూరులోనే.. 19 వేల మంది వరకూ అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. ఇక ఆ తర్వాతి దశలో రూ.20 వేల లోపు డిపాజిట్లు చేసిన వారికి చెక్కులు పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా.. ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. అగ్రిగోల్డ్ బాధితుల బాధను అర్థం చేసుకున్నా.. ఇక మీకు నేను వున్నాను అంటూ.. జగన్ అన్నారు. ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చాం. ఏడాదికి రూ.10 వేలు ఇస్తూ.. ఆటో కార్మికులను ఆదుకుంటుంన్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.

10వేల లోపు వారికి ఊరట..

పది వేల రూపాయలలోపు డిపాజిటర్లకు కలెక్టర్ల ద్వారా నగదు అందించబోతుంది వైసీపీ ప్రభుత్వం. జిల్లాల వారిగా బాధితులు.. వారికి అందే మొత్తాన్ని పరిశీలిస్తే:

 • గుంటూరు జిల్లాలో 19,751 మందికి 14 కోట్ల 9 లక్షల రూపాయలు
 • చిత్తూరు జిల్లాలో 8,257 మందికి 5 కోట్ల 81 లక్షల రూపాయలు
 • తూర్పు గోదావరి జిల్లాలో 19,545 మందికి 11 కోట్ల 46 లక్షల రూపాయలు
 • పశ్చిమ గోదావరి జిల్లాలో 35,496 మందికి 23 కోట్ల 5 లక్షల రూపాయలు
 • విజయనగరం జిల్లాలో 57,491 మందికి 36 కోట్ల 97 లక్షల రూపాయలు
 • శ్రీకాకుళం జిల్లాలో 45, 833 మందికి 31 కోట్ల 41 లక్షల రూపాయలు
 • కర్నూలు జిల్లాలో 15,705 మందికి 11 కోట్ల 14 లక్షల రూపాయలు
 • నెల్లూరు జిల్లాలో 24,930 మందికి 16 కోట్ల 91 లక్షల రూపాయలు
 • కృష్ణా జిల్లాలో 21,444 మందికి 15 కోట్ల 4 లక్షల రూపాయలు
 • అనంతపురం జిల్లాలో 23,838 మందికి 20 కోట్ల 64 లక్షల రూపాయలు
 • కడప జిల్లాలో 18,864 మందికి 13 కోట్ల 18 లక్షల రూపాయలు
 • ప్రకాశం జిల్లాలో 26,586 మందికి 19 కోట్ల 11 లక్షల రూపాయలు
 • విశాఖపట్నంలో 52,005 మందికి 45 కోట్ల 10 లక్షల రూపాయలు