ఏపీలో 34చోట్ల 55కేంద్రాల్లో కౌంటింగ్‌

అమరావతి: రీపోలింగ్‌ ముగియడంతో ఎన్నికల సంఘం కౌంటింగ్‌  ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌లో 34 చోట్ల 55 కేంద్రాల్లో కౌంటింగ్‌ ప్రక్రియకు 13 జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 23వ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం 25వేలమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్‌ ప్రక్రియకు 200మంది పరిశీలకులను నియమించింది. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. 8.30 గంటల నుంచి […]

ఏపీలో 34చోట్ల 55కేంద్రాల్లో కౌంటింగ్‌
Follow us

| Edited By: Team Veegam

Updated on: May 30, 2019 | 8:57 PM

అమరావతి: రీపోలింగ్‌ ముగియడంతో ఎన్నికల సంఘం కౌంటింగ్‌  ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌లో 34 చోట్ల 55 కేంద్రాల్లో కౌంటింగ్‌ ప్రక్రియకు 13 జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 23వ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం 25వేలమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్‌ ప్రక్రియకు 200మంది పరిశీలకులను నియమించింది. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.

8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక నియోజకవర్గంలో ఈవీఎంల లెక్కింపు అన్ని రౌండ్లు పూర్తయిన తరువాత ఐదు వీవీప్యాట్‌ యంత్రాలను లాటరీ విధానంలో తీస్తారు. ఆ వీవీ ప్యాట్‌ల్లోని స్లిప్పులను లెక్కించడం పూర్తయిన తరువాతనే ఆ నియోజకవర్గ ఫలితాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేసిన తరువాత అధికారికంగా వెల్లడిస్తారు. వీవీప్యాట్‌ యంత్రాల్లో స్లిప్పులు లెక్కించడానికి సమయం పట్టనుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల వెల్లడికి ఆలస్యమైనప్పటికీ ఈవీఎంలు లెక్కించిన తరువాత అనధికారికంగా ఫలితాలు తెలిసిపోతాయి.