AP CM YS Jagan: ఇవాళ ఏపీ సాగునీటి ప్రాజెక్టులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం
రాష్ట్రంలో కరోనా నియంత్రణ, సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు.
AP CM YS Jagan Today Reviews: సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రారంభం కానున్న సమీక్ష సమావేశంలో పోలవరంతో పాటు ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల ప్రగతిపై చర్చించనున్నారు. వానా కాలం సమీపిస్తుండటంతో కాఫర్ డ్యాం నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయడంపై సీఎం జగన్ చర్చించనున్నారు. స్పిల్ ఛానల్‌లో మట్టి, కాంక్రీట్ పనులపై సమీక్షించనున్నారు. అలాగే, నెల్లూరు, సంగం బ్యారేజీలపై సమీక్షించనున్నారు. వెలిగొండ రెండో టన్నెల్, నేరడి బ్యారేజీ, వంశధారలో ఫేజ్ 2, స్టేజ్ 2 పనులపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
అలాగే, ఏపీలో కరోనా వైరస్ విజృంభణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు జరగనుంది. ఆసుపత్రుల్లో బెడ్స్ పరిస్థితి, కరోనా బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలపై సీఎం సమీక్షించనున్నారు. మరోవైపు కరోనా కట్టడికి చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీఎం సమీక్షిస్తారు. కరోనా నియంత్రణకు ఆనందయ్య ఇస్తున్న మందుపై కూడా సీఎం జగన్ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.
Read Also.. UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పిన ఎస్‌యూవీ వాహనం.. చిన్నారితో సహా ఐదుగురు దుర్మరణం