ఆమ్ ఆద్మీ పార్టీ తరపున బరిలో ట్రాన్స్‌జెండర్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రయాగ్‌రాజ్ పార్లమెంట్ స్థానాన్ని చిర్పి భవాని అనే ట్రాన్స్‌జెండర్‌కు కేటాయిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నేత సంజ‌య్ సింగ్ ప్రకటించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బీజేపీ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల వర్గాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఏఏపీ ప్రయాగ్‌రాజ్ లోక్‌సభ స్థానాన్ని కేటాయించడం పట్ల చిర్పి భవాని స్పందించారు. బీజేపీ ప్రభుత్వం తమ వర్గం వారిని భిక్షగాళ్లలా చూసిందని ఆరోపించారు. ఆమ్ […]

ఆమ్ ఆద్మీ పార్టీ తరపున బరిలో ట్రాన్స్‌జెండర్
Follow us

| Edited By:

Updated on: Mar 29, 2019 | 9:15 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రయాగ్‌రాజ్ పార్లమెంట్ స్థానాన్ని చిర్పి భవాని అనే ట్రాన్స్‌జెండర్‌కు కేటాయిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నేత సంజ‌య్ సింగ్ ప్రకటించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బీజేపీ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల వర్గాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఏఏపీ ప్రయాగ్‌రాజ్ లోక్‌సభ స్థానాన్ని కేటాయించడం పట్ల చిర్పి భవాని స్పందించారు. బీజేపీ ప్రభుత్వం తమ వర్గం వారిని భిక్షగాళ్లలా చూసిందని ఆరోపించారు. ఆమ్ ఆద్మీపార్టీ మాత్రమే ట్రాన్స్‌జెండర్‌ల హక్కుల కోసం పోరాడిందన్న ఆమె.. ఇతర ఏ పార్టీలు తమను పట్టించుకోలేదని విమర్శించారు. అయితే చిర్పి భవాని సామాజిక కార్యకర్తగా పనిచేస్తుండటంతోపాటు, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో జ్యూరీ మెంబర్‍గా కూడా ఉన్నారు.