ఏపీలో 20 హైదరాబాద్‌లను అభివృద్ధి చేస్తా చంద్రబాబు

కేసీఆర్ పెత్తనాన్ని అంగీకరిస్తారా? జగన్‌కు హైదరాబాద్ ముద్దు అమరావతి వద్దు ఏపీలో 20 హైదరాబాద్‌లను అభివృద్ధి చేస్తా దేశ నాయకులతో మేమున్నామని చెప్పిస్తున్నా రావులపాలెం: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. దేశ నాయకులతో మేమున్నామని చెప్పిస్తున్నా నా వెనక మీరు ఉంటే కొండనైనా బద్దలు చేస్తా.. మీరంతా నా కోసం, రాష్ట్రం కోసం పని చేస్తున్నారు అని చంద్రబాబు ప్రజలనుద్దేశించి అన్నారు. దేశంలో ఏపీని […]

ఏపీలో 20 హైదరాబాద్‌లను అభివృద్ధి చేస్తా చంద్రబాబు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 05, 2019 | 4:47 PM

  • కేసీఆర్ పెత్తనాన్ని అంగీకరిస్తారా?
  • జగన్‌కు హైదరాబాద్ ముద్దు అమరావతి వద్దు
  • ఏపీలో 20 హైదరాబాద్‌లను అభివృద్ధి చేస్తా
  • దేశ నాయకులతో మేమున్నామని చెప్పిస్తున్నా

రావులపాలెం: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

దేశ నాయకులతో మేమున్నామని చెప్పిస్తున్నా నా వెనక మీరు ఉంటే కొండనైనా బద్దలు చేస్తా.. మీరంతా నా కోసం, రాష్ట్రం కోసం పని చేస్తున్నారు అని చంద్రబాబు ప్రజలనుద్దేశించి అన్నారు. దేశంలో ఏపీని నెంబర్ వన్‌గా చేసే బాధ్యత నాది. మీ అందరి బాధ్యత, రాష్ట్రం బాధ్యత నాది. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం వెనకే ఉండాలి. మన కోసం మొన్న ఫరూక్ వచ్చారు, నిన్న కేజ్రీవాల్ వచ్చారు. ఎల్లుండి మమత వస్తున్నారు.. తర్వాత శరద్ పవార్, దేవెగౌడ వస్తారు.

దేశంలోని అందరు నాయకులు సంఘీభావం తెలియజేస్తున్నారు. వాళ్లందరినీ మీ ముందర పెట్టి, మన సమస్యల పట్ల మేము కూడా అండగా ఉంటామని చెప్పిస్తున్నాను. జగన్ అయితే ఎవరికీ సపోర్ట్ చేయడు. కానీ మోడీ, కేసీఆర్‌లకు సపోర్ట్ చేస్తున్నాడని చంద్రబాబు అన్నారు.

నరేంద్ర మోడీతో ఢీ అంటే ఢీ అన్నానంటే.. అదంతా మీ కోసమే తమ్ముళ్లూ. మన నాయకులపై ఐటీ దాడులు చేస్తున్నారు. బీజేపీ, వైసీపీ నాయకులపై ఐటీ దాడులు లేవని చంద్రబాబు అన్నారు.

జగన్‌కు హైదరాబాద్ ముద్దు అమరావతి వద్దు ఇంకా మాట్లాడుతూ.. కోడికత్తి పార్టీని, కేసీఆర్‌ను హెచ్చరిస్తున్నాను.. వాళ్ల అవినీతి డబ్బులు మాకు అవసరం లేదు. నేను అభివృద్ధి చేస్తుంటే కేసీఆర్ అడ్డుపడుతున్నాడు. కోడి కత్తి పార్టీని అడ్డు పెట్టుకుని మన మీద పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చంద్రబాబు అన్నారు. 88 సీట్లు గెలిచిన కేసీఆర్ ప్రతిపక్షాలను కొనేస్తున్నాడు. ఇప్పుడు 16 ఎంపీ సీట్లు గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పుతాడంట. మనమీద పెత్తనం చేస్తాడు. కేసీఆర్ పెత్తనాన్ని అంగీకరిస్తారా? జగన్‌కు హైదరాబాద్ ముద్దు, అమరావతి వద్దు. ఇలాంటి పార్టీలకు ఓటేయాలా? వీళ్లు ఊరూరా నాయకులను, ఓట్లను కొంటారని చంద్రబాబు మండిపడ్డారు.

ఏపీలో 20 హైదరాబాద్‌లను అభివృద్ధి చేస్తా కేసీఆర్‌కు బంగారు బాతును అప్పగించాం. తెలంగాణలో ఒక హైదరాబాద్ ఉంటే, ఏపీలో 20 హైదరాబాద్‌లను అభివృద్ధి చేస్తా. కేసీఆర్ కూడా మనతో రాజీ పడే రోజు వస్తుంది. మనం ఎవరికీ సరెండర్ కావాల్సిన అవసరం లేదని రావులపాలెం సభలో చంద్రబాబు అన్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు