బీజేపీలోకి నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు..?
టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరుతారని విస్తృత ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కాషాయ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను వీరు ధృవీకరించనూ లేదు.. ఖండించను లేదు. ‘‘దీనిపై చర్చిస్తున్నాము.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు’’ అని మాత్రమే చెబుతున్నారు. బయటికి ఆ మాటలు చెబుతున్నప్పటికీ.. వారు బీజేపీలోకి వెళ్లేందుకే మక్కువ చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఏపీలో […]
టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరుతారని విస్తృత ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కాషాయ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను వీరు ధృవీకరించనూ లేదు.. ఖండించను లేదు. ‘‘దీనిపై చర్చిస్తున్నాము.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు’’ అని మాత్రమే చెబుతున్నారు. బయటికి ఆ మాటలు చెబుతున్నప్పటికీ.. వారు బీజేపీలోకి వెళ్లేందుకే మక్కువ చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో పార్టీ సీనియర్ నాయకులు బీజేపీలోకి చేరాలన్న నిర్ణయానికి వస్తున్నారట. మరోవైపు ఎప్పటినుంచో ఏపీలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోన్న బీజేపీ.. వారిని చేర్చుకునేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా వీరందరితో బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.