2019 నుంచి సీఎంగా రెండేళ్ల పాటు కొనసాగారు. 2018లో యడియూరప్ప రాజీనామా అనంతరం 80 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్, 36 స్థానాల్లో గెలిచిన జేడీఎస్ కలిసి కుమారస్వామి సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఏడాది తర్వాత కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలను బీజేపీ ఆకట్టుకుంది. దీంతో వారు శాసనసభ్యత్వానికి రాజీనామాలు సమర్పించి బీజేపీలో చేరారు. దీంతో 2019 జూలై 23న జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో 2019 జూలై 26న యెడియూరప్ప నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.