Dandruff Relief Oils: షాంపూకి బదులు ఈ 6 నూనెలు రాసుకుంటే చాలు.. 2 రోజుల్లో చుండ్రు మాయం..!
చుండ్రు సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది యాంటీ డాండ్రఫ్ షాంపూలను ఉపయోగిస్తుంటారు. కానీ చాలా సందర్భాల్లో పరిష్కారం ఉండదు. అయితే ఎలాంటి షాంపూ అవసరం లేకుండా కొన్ని రకాల నూనెలతో చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ నూనెలేమిటే ఇప్పుడు చూద్దాం..
Updated on: Jul 09, 2023 | 11:41 AM

కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో సహజమైన మాయిశ్చరైజింగ్ గుణాలు, లారిక్ యాసిడ్ అనే యాంటీమైక్రోబయల్ ఏజెంట్ ఉన్నందున ఇది స్కాల్ప్‌ను హైడ్రేట్ చేస్తుంది. ఫలితంగా చుండ్రును నివారిస్తుంది. ఈ నూనెలో లారిక్ యాసిడ్ కూడా ఉంటుంది, ఇది తలపై యాంటీమైక్రోబయల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

టీ ట్రీ ఆయిల్: టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఫలితంగా ఈ నూనె చుండ్రు, తలలో దురదను తగ్గించడంలో సహాయపడుతుంది.

వేప నూనె: వేప నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నందున ఇది 2 రోజుల్లోనే మీ జుట్టులోని చుండ్రును తొలగిస్తుంది.

ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్‌లో కూడా సహజమైన మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. ఇవే కాక యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి చుండ్రును నిరోధించడంలో మెరుగ్గా పనిచేస్తాయి.

ఆముదం: ఆముదంలో ఉండే కొవ్వు ఆమ్లాలు చుండ్రును నయం చేయడంతో పాటు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలడాన్ని నివారించడానికి ఇది ఉత్తమమైన ఎంపిక.





























