మునగ ఆకులతో బోలేడు ప్రయోజనాలు.. తిన్నారంటే ఎంత లాభమో!
samatha
30 march 2025
Credit: Instagram
మునగ ఆకులను ఆహారంలో చేర్చుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. అవి ఏవి అంటే?
మునగ ఆకులు తినడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. అంతే కాకుండా వీటిని రాత్రి సమయంలో పొడిని టీ లేదా పాలలో తీసుకోవడం వలన నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చునంట.
ఇక ఈ ఆకులు ఎముకల బలానికి దివ్య ఔషధంలా పని చేస్తాయి. వీటిని పొడి చేసుకొని టీ లేదా పాలలో కలుపుకొని తాగడం వలన ఎముకలు ఆరోగ్ంయ గా ఉండటమే కాకుండా కాల్షియం పెరుగుతుందంట.
రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మునగ ఆకులు ఎంతగానో ఉపయోగపడుతాయి. వీటిలో ఉండే సహజ పోషకాలు శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుందంట.
మునగ ఆకులలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువలన వీటిని ఆహారంలో తీసుకోవడం వలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది.
మునగ ఆకులు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన కొలెస్ట్రాలను తగ్గించి రక్తపోటును నివారిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
మునగ ఆకులను ఆహారంగా తీసుకోవడం వలన ఇందులోని ఫైబర్, బయోయాక్టివ్ అణువులు జీర్ణక్రియ సాఫీగా సాగడానికి సహాయపడతాయి, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్థాయి.
రోగనిరోధక శక్తి పెంచడంలో కూడా మునగ ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని తినడం వలన శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, అనేక వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతాయి.