- Telugu News Photo Gallery You can check stress easily with these simple tips, Check Here is Details in Telugu
Stress Relief Tips: ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా ఒత్తిడికి చెక్ పెట్టొచ్చు..
ఒత్తిడి అనేది ఈ రోజుల్లో సర్వ సాధారణంగా మారింది. ఇంట్లోని ప్రాబ్లమ్స్, ఆఫీసులోని పని ఒత్తిడి కారణంగా మగవారు, ఆడవారు కూడా ఒత్తిడిని లోనవుతూ ఉంటారు. ఈ ఒత్తిడిని కొన్ని ఈజీ చిట్కాలతోనే సులభంగా తగ్గించుకోవచ్చు. ఒత్తిడి వల్ల చాలా వరకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి..
Updated on: Jan 31, 2025 | 7:42 PM

ఈ మధ్య కాలంలో ఒత్తిడి అనేది సర్వ సాధారణమయ్యింది. ఎంతో మంది ఆందోళన, ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారు. ఒత్తిడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఇతర సమస్యలు కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది. ఇంట్లోని, ఆఫీసులోని సమస్యల కారణంగా మనిషి ఉక్కిరి బిక్కిరి అవుతాడు. ఈ క్రమంలో ఒత్తిడిని ఎదుర్కొనాల్సి వస్తుంది.

కానీ ఈ చిన్న చిట్కాలతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఎక్కువగా ఉద్యోగం చేసే మహిళలు ఒత్తిడికి గురవుతున్నారు. మహిళలకు అయితే ఇంట్లో పని, ఆఫీసులో పని కారణంగా చాలా ఒత్తిడిగా ఉంటుంది.

పెళ్లైన మహిళలు మీ డేని ముందుగానే మీరు ప్లాన్ చేసుకోవాలి. కుదరని సమయంలో ఇతర ఆప్షన్స్ ఎంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మహిళల్లో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇంట్లోని వాళ్లకు మీ ఇబ్బందిని చెప్పడం వల్ల కాస్త రిలాక్స్ అవుతారు.

మగ వారు కూడా ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక మద్యపానం, ధూమపానానికి అలవాటు అవుతారు. అలా కాకుండా మగవారు కూడా తమ సమస్యలను ఆఫీసులో, ఇంట్లో చెప్పడం వల్ల కాస్త రిలాక్స్ పొందవచ్చు.

ఒత్తిడి ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యుల్ని సంప్రదించాలి. అలాగే మిమ్మల్ని రిలాక్స్ చేసే ఫుడ్స్ తీసుకోవాలి. ఉదయాన్నే యోగా, ధ్యానం, వాకింగ్ వంటివి చేయడం వల్ల కూడా ఒత్తిడి అనేది తగ్గుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




