- Telugu News Photo Gallery Applying turmeric directly to the face? Note these things, Check Here is Details
Turmeric for Face: పసుపును నేరుగా ముఖానికి రాస్తున్నారా.. ఈ విషయాలు గమనించండి!
పసుపును మనం ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. ప్రతీ రోజూ వంటల్లో ఖచ్చితంగా పసుపును యూజ్ చేస్తారు. పసుపుతో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా.. అందాన్ని పెంచడంలో కూడా చక్కగా ఉపయోగ పడుతుంది. చాలా మంది పసుపును నేరుగా ముఖానికి రాస్తూ ఉంటారు. అలా రాసేవారు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి..
Updated on: Jan 31, 2025 | 7:53 PM

పసుపు ఆరోగ్యానికి ఎన్నో రకాల మేలు చేస్తుందన్న విషయం చాలా మందికి తెలుసు. పసుపుతో శరీర ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా పెంచుకోవచ్చు. పసుపులో చాలా రకాల పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. ఎక్కువగా చాలా మంది పసుపును అందాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు.

పసుపును అనేక క్రీమ్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఇంటి దగ్గర కూడా చాలా మంది పసుపును ముఖానికి రాసుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఇంట్లో పెద్దవాళ్లు నేరుగా పసుపును ముఖానికి రాసుకుంటూ ఉంటారు. ఇలా నేరుగా పసుపును రాసుకోవడం వల్ల అనేక ఎఫెక్ట్స్ ఉంటాయట.

పసుపును నేరుగా ముఖానికి రాసుకుని ఎండలోకి వెళ్లడం వల్ల.. చర్మంపై అలెర్జీ సమస్యలు రావచ్చు. కాబట్టి అప్లై చేసిన వెంటనే ఎండలోకి వెళ్లకండి. పసుపును నేరుగా ముఖంపై రాయడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. కాబట్టి డ్రై స్కిన్ ఉన్నవారు పసుపును రాయడం మానుకోవాలి.

నేరుగా పసుపును చర్మంపై రాస్తే.. కాస్త మంటగా, దురదగా కూడా ఉంటుంది. ఇలాంటి వారు కూడా పసుపుకు దూరంగా ఉండటం మంచిది. సున్నితమైన చర్మం ఉండేవారు కూడా పసుపును రాసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

పసుపును ఎప్పుడైనా సరే నేరుగా కంటే.. అందులో ఇతర పదార్థాలు కలిపి రాయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పెరుగు, పాలు, క్రీమ్, తేనె వంటివి కలిపి రాస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. పసుపును ఎప్పుడైనా సరే నేరుగా కంటే.. అందులో ఇతర పదార్థాలు కలిపి రాయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పెరుగు, పాలు, క్రీమ్, తేనె వంటివి కలిపి రాస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.




