Ulcers: ఈ లక్షణాలు కనిపించాయంటే అల్సర్‌కు కారణమే.. లేట్ చేయకండి..
అల్సర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అల్సర్ చాలా మందికి తెలిసే ఉంటుంది. అల్సర్‌ని ముందుగానే గుర్తించి చికిత్స్ తీసుకోకపోతే.. ప్రాణాలికే ప్రమాదమని ఆరోగ్య నిపుణులే చెబుతారు. అల్సర్‌ని ముందుగానే గుర్తించడానికి ఈ లక్షణాలు చక్కగా సహాయ పడతాయి. అవేంటో చూడండి..
Updated on: Jan 31, 2025 | 8:46 PM

ఈ మధ్య కాలంలో అనేక అనారోగ్య సమస్యలు అనేవి బాగా ఎక్కువైపోయాయి. ఎక్కువగా జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అల్సర్‌తో ఎక్కువగా బాధ పడుతున్నారు. అల్సర్ కారణంగా పేగులు, పొట్టపై ఎక్కువగా ఇబ్బంది పడుతుంది.

అల్సర్ కారణంగా పొట్టలో, పేగులపై గాయాలు, పుండ్లు ఏర్పడతాయి. ఇది బాగా పెరిగితే.. క్యాన్సర్‌కు కారణం అవుతుంది. అల్సర్ వచ్చే ముందు కొన్ని రకాల లక్షణాలు అనేవి కనిపిస్తాయి. వాటితో వెంటనే అలెర్ట్ అయి.. ముందుగానే జాగ్రత్త పడొచ్చు.

కడుపులో ఎక్కువగా చికాకుగా అనిపించడం, కడుపులో నొప్పి రావడం, ఉబ్బరం, కొంచెం ఆహారం తిన్నాక కడుపు నిండిన అనుభూతిగా ఉండటం, ఏదో గందర గోళంగా అనిపించడం వంటివి అల్సర్‌కు లక్షణాలుగా చెబుతారు.

అలాగే గుండెలో ఎక్కువగా మంట, చికాకు, వికారం, వాంతులు అనిపించడం, నల్లగా మల విసర్జన అవడం, ఊపిరి సరిగా అందకపోవడం, మూర్చ, తీవ్రంగా అసలట, ఉన్నట్టుండి వెయిట్ లాస్ అవడం, ఆకలి లేకపోవడం.. ఈ లక్షణాలు కనిపిస్తే లేట్ చేయకండి.

అల్సర్ అనేది చాలా తీవ్రమైనది. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. లేదంటే పరిస్థితి తీవ్రమై.. రక్త స్రావం అవ్వడం, మలంలో రక్తం పడటం, పేగులకు రంధ్రాలు పడినా ఇబ్బందులు తప్పవు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)





























