గర్భధారణ సమయంలో వీరభద్రాసనం చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కాళ్ళు, వెన్నెముక, నడుము కండరాలను బలపరుస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ యోగాసనం చేయడం వల్ల గర్భధారణ సమయంలో వచ్చే అలసట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దరిచేరవు. అంతేకాదు ఈ యోగా ఆసనం చేయడం వల్ల హామ్ స్ట్రింగ్స్, దూడ కండరాల వెనుక భాగం సాగుతుంది. అదే సమయంలో ఈ యోగా ఆసనం మనస్సును బలపరుస్తుంది. ఇది డెలివరీకి మానసికంగా సిద్ధం కావడానికి కూడా సహాయపడుతుంది.