నాసా ప్రకారం, థార్సిస్ మోంటెస్ అంగారక గ్రహంపై అతిపెద్ద అగ్నిపర్వత ప్రాంతం. ఇది సుమారు 4000 కి.మీ వరకు విస్తరించి ఉండగా.. ఎత్తు 10 కి.మీ. ఇక్కడ 12 పెద్ద అగ్నిపర్వతాలు ఉన్నాయి. థార్సిస్ ప్రాంతంలో నాలుగు అతిపెద్ద అగ్నిపర్వతాలు ఉన్నాయి. అవి అస్క్రెయస్ మోన్స్, పావోనిస్ మోన్స్, ఆర్సియా మోన్స్ మరియు ఒలింపస్ మోన్స్.